ప్రస్తుత కాలంలో రోజు రోజుకి సైబర్ నేరగాళ్ల అరాచకాలు ఎక్కువైపోయాయి.ఈ క్రమంలోనే ఎంతో మంది అమాయకులను మోసం చేసి లక్షలకు లక్షలు డబ్బులు దోచుకుంటున్నారు.అయితే సాధారణ వ్యక్తులు లేదా చదువుకోని వారు ఇలాంటి వారి చేతిలో మోసపోయారు అంటే అర్థం ఉంటుంది కానీ.. ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే వ్యక్తికి మాత్రం సైబర్ నేరగాళ్లకు గురించి చాలా అవగాహన ఉంటుంది.ఈ విధంగానే ఇంజనీర్ గా పని చేసేటటువంటి ఓ వ్యక్తి తనను ఎవరూ మోసం చేయలేరు అంటూ ఏకంగా 8 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన తాజాగా చోటు చేసుకుంది.
అతను ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతనికి ఒక రోజు ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి అతని కార్డు వివరాలను అడిగారు. ఈ క్రమంలోనే ఆ ఇంజనీర్ ఈ విషయం గ్రహించి పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని బెదిరించడంతో అవతల వ్యక్తి ఫోన్ కట్ చేశారు.ఈ విధంగా వచ్చే ఫోన్ కాల్స్ తో ఎంతో అప్రమత్తంగా ఉండే ఇంజనీర్ చివరికి సైబర్ నేరగాళ్ల చేతిలో చిత్తుగా మోసపోయాడు. తనకు తక్కువ జీతం రావడంతో అతను డబ్బు సంపాదించాలన్న ఆశ పెరిగింది. ఈ క్రమంలోనే కొంత డబ్బులు వ్యాపారంలోకి పెట్టి మరింత డబ్బును సంపాదించాలనుకున్నాడు.
ఈ క్రమంలోనే సదరు వ్యక్తికి అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి కేవలం 20 వేల పెట్టుబడితో కొన్ని రోజుల తర్వాత మీరు రూ. 62000 లాభం పొందుతారని చెప్పడంతో ఇంజనీర్ కొంత అమౌంట్ ను ఇన్వెస్ట్ చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు అతనికి ఒక లింకు పంపించారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే అందులో పూర్తి వివరాలు ఉన్నాయి. ఈ విధంగా వివరాలన్నీ ఉండటంతో ఇంజనీర్ ఇరవై వేలు పెట్టుబడి పెట్టి కొద్దిరోజులకు 62000 లాభం పొందాడు. ఈ విధంగా డబ్బులు రావడంతో అతనికి ఆశ పెరిగింది.
ఈ క్రమంలోనే మరింత డబ్బు సంపాదించాలని భావించిన ఇంజనీర్ ఈ సారి ఏకంగా అప్పు చేసి అందులో పెట్టుబడి పెట్టాడు. ఒకేసారి ఎనిమిది లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టాడు.ఈసారి ఎక్కువ డబ్బులను పొందవచ్చని భావించింన ఇంజనీర్ కి అప్లికేషన్ ఫామ్లో విత్ డ్రా బటన్ కనిపించకపోవడంతో అవతలి వ్యక్తికి ఫోన్ చేశాడు. ఫోన్ స్విచాఫ్ రావడంతో అతను మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.



























