ప్రస్తుత కాలంలో ఎంతోమంది యువత అందంగా కనిపించాలని కోరుకుంటున్నారు.ఈ క్రమంలోనే వారు అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మార్కెట్లో దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆ ఉత్పత్తులు మనకు ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా మహిళలు జుట్టుకు ఎక్కువ భాగం హెయిర్ డై వేయడం మనం చూస్తున్నాము. కొందరికి జుట్టు నల్లగా ఉండాలని భావించి బ్లాక్ హెన్నా, లేదంటే పింక్ పర్పుల్ వంటి రంగులు వేయడానికి ఎంతో ఇష్టం చూపుతున్నారు. అలాంటి వారు ఈ విషయాన్ని కనుక తెలుసుకుంటే ఇక జీవితంలో ఎప్పుడూ రంగు వేసుకోరు.

సాధారణంగా మన జుట్టు నల్లగా కనిపించడానికి గల కారణం ఏమిటంటే మెలనిన్ అనే పిగ్మెంట్ ఉండటం వల్ల మన చుట్టూ నలుపుగా కనిపిస్తుంది.మన శరీరంలో ఎప్పుడైతే మెలనిన్ పిగ్మెంట్ తక్కువగా ఉంటుందో ఆ సమయంలో మన జుట్టు రంగు మారుతుంది.మన దేశంలో అయితే ఎక్కువమంది తెల్లగా మారిన జుట్టుకు నలుపురంగు వేస్తూ ఉంటారు. అదే విదేశాలలో తెల్లగా ఉన్న జుట్టు వివిధ రకాల రంగులను ఉపయోగిస్తూ ఉంటారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా బోర్డ్ పాండా అనే యువతులు హెయిర్ డై వాడటం వల్ల వారికి ఎదురైన పరిస్థితిని ఫోటోలు ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ విధంగా హెయిర్ డై వాడటం వల్ల వారికి తీవ్రమైన అలర్జీలు వచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు.వారు హెయిర్ కోసం పర్పుల్ కలర్ ఉపయోగించడం వల్ల వారికి చర్మం మొత్తం పర్పుల్ కలర్ అలర్జీలు ఏర్పడ్డాయని ఈ సందర్భంగా వారు తెలిపారు .
అదేవిధంగా మరొక మహిళకు కళ్ళు, నోరు, మొహం మొత్తం వాచిపోయాయి. మనం ఉపయోగించే ఈ హెయిర్ డై లో అధిక రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు కొందరికి వారి శరీరతత్వాన్ని బట్టి సరిపడటం లేదా అలర్జీలు రావడం అనేది జరుగుతుంది.ఈ క్రమంలోనే ముందుగా ఆ హెయిర్ డై మనకు సరిపోతుందా లేదా అనే విషయాన్ని టెస్ట్ చేసుకుని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఈ విషయాన్ని పక్కన పెట్టడం వల్లే ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి.































