Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసుకుంటూ జీవనం గడిపేది అయితే ఈమె చాలా తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయారని చెప్పాలి. ఎన్నో కార్యక్రమాలలో కూడా కుమారి ఆంటీ సందడి చేశారు. ఇక త్వరలోనే కుమారి ఆంటీ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.
ఈ విధంగా కుమారి ఆంటీ రోజురోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సినీ నటుడు సోను సూద్ వచ్చి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చారు. కుమారి ఆంటీని కలిసిన ఈయన ఆమెతో సరదాగా మాట్లాడి తన కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మహిళా సాధికారత..
మహిళా సాధికారత కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని సోను సూద్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తనకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే నాకు తెలియజేయాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఇక సోను సూద్ గురించి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఎంతోమందికి సహాయం చేసిన సోను సూద్ కి ఏమిచ్చినా తక్కువే అంటూ కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


























