హైదరాబాద్: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలసి నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో, చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్‌లో వార్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అద్భుతంగా నిర్వహించారు.

అభిమానుల మనసు దోచుకున్న తారక్ స్పీచ్
ఈవెంట్‌కు తారక్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ ఇద్దరూ బ్లాక్ అండ్ బ్లాక్ గెటప్స్‌లో ఆకట్టుకున్నారు. ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ, 13 ఏళ్ల క్రితం బాద్షా సినిమా ఈవెంట్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక అభిమాని ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని గుర్తు చేసుకున్నారు. అందుకే పబ్లిక్ ఈవెంట్లకు తాను భయపడతానని చెప్పారు. అయితే, వార్ 2 చేయడానికి కారణం నిర్మాత ఆదిత్య చోప్రా అని, “మీ అభిమానులు గర్వపడేలా సినిమా తీయాలి” అని ఆయన చెప్పిన మాటలు తనకు భరోసా కలిగించాయని తారక్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ధన్యవాదాలు
ఈవెంట్ అనంతరం ఎన్టీఆర్ ఓ వీడియో ద్వారా అభిమానులకు ప్రత్యేక సందేశం పంపించారు. ఈవెంట్ విజయవంతం కావడానికి సహకరించినందుకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలపడం మరిచిపోయానని, అందుకు క్షమాపణలు చెప్పారు. “నా పాతికేళ్ల ప్రయాణాన్ని అభిమానులతో పంచుకునే ఉత్సాహంలో ఈ తప్పు జరిగింది. వార్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని ఆయన పేర్కొన్నారు.
భారీ బడ్జెట్, గ్లోబల్ లొకేషన్లు
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల విడుదల హక్కులను నిర్మాత నాగవంశీ సొంతం చేసుకున్నారు. స్పెయిన్, జపాన్, అబుదాబి వంటి లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమాను రూ.210 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న అంచనాలను, అప్పటికే విడుదలైన పాటలు, టీజర్లు మరింత పెంచాయి.
తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేసిన ఎన్టీఆర్… #War2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన #JrNTR #HrithikvsNTR #HritikRoshan pic.twitter.com/7HGFp7Andt
— TeluguDesk (@telugudesk) August 11, 2025




























