Soundarya: ఇప్పటికి నా కూతురు సౌందర్య కలలోకి వస్తుంది… ఎమోషనల్ కామెంట్స్ చేసిన సౌందర్య తల్లి!

0
34

Soundarya: వెండితెర నటిగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో నటి సౌందర్య ఒకరు.కేవలం 30 సంవత్సరాల వయసులోనే దాదాపు 100 సినిమాలలో నటించే అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో అతి చిన్న వయసులోనే మరణించారు. ఇప్పటికీ ఈమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.

ఎన్నో అద్భుతమైన సినిమాలలో ఎలాంటి గ్లామరస్ పాత్రలకు తావు లేకుండా అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె మరణం ఇప్పటికీ అభిమానులకు తీరని లోటు.ఇక సౌందర్య మరణించి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ ఈమె జ్ఞాపకాలను అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు.

తాజాగా సౌందర్య తల్లి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన కుమార్తె సౌందర్య కుమారుడు అమర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే రోజు ప్రమాదంలోసౌందర్య తన సోదరుడు అమర ఇద్దరు కూడా మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సౌందర్య తల్లి మాట్లాడుతూ తనకు మనసు బాగా లేకపోయినా తాను ఏదైనా బాధగా ఆలోచిస్తూ పడుకున్న ఆరోజు రాత్రి తన పిల్లలు కలలోకి వస్తారని ఈమె తెలియజేశారు.

Soundarya: నీకెందుకు నేనున్నాగా అంటుంది…


ఇలా నా మనసు బాధగా ఉన్నప్పుడు నా పిల్లలు తప్పకుండా కలలోకి వస్తారని ఇక సౌందర్య అయితే మమ్మీ నీకెందుకు నేను ఉన్నాను కదా అంటుంది కానీ ఆ కల మధ్యలోనే ఆగిపోతుంది అలా ఎందుకు ఆగిపోతుందో నాకు ఇప్పటికే అర్థం కావడం లేదు. అంటూ ఈమె తన కూతురు కొడుకుని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.