దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం అప్రెంటిస్ ఖాళీలు 4103 ఉన్నట్లు పేర్కొన్నారు. అప్రెంటిస్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏసీ మెకానిక్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్, ఎంఎంటీఎం, ఎంఎండబ్ల్యూ, పెయింటర్, వెల్డర్ లాంటి పోస్టులున్నాయి. అప్రెంటీస్ యాక్ట్-1961, అప్రెంటీస్‌షిప్ రూల్స్-1992 ప్రకారం ఈ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. ఇవి ఏడాది గడువు గల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే.
ఈ పోస్టులకు 2021 అక్టోబర్ 4న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 3 చివరి తేదీ. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
మొదట అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగులు వెబ్‌సైట్ https://scr.indianrailways.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది. ONLINE APPLICATION FOR ACT APPRENTICE TRAINING 2021 పై క్లిక్ చేసి తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉటుంది. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి. ఇలా ఫార్మాట్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి.






























