Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి తెలియనిది కాదు. తమిళంలోనే కాకుండా… మళయాళం, తెలుగులో కూడా ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. తెలుగులో ఉప్పెన ద్వారా తెలుగు తెరకు పరియచం అయ్యారు. తన విలనీజం, నటనతో అందర్ని ఆకట్టుకున్నాడు. చిరంజీవి ’సైరా‘ సినిమాలో కూడా ప్రత్యేక పాత్రలో నటించాడు.

అయితే తెలుగులో కూడా విజయ్ సేతుపతితో సినిమా చేయాలని పలువురు నిర్మాతలు అనుకుంటున్నారు. అయితే తాజాగా ఓ నిర్మాత తెలుగులో సినిమా చేయాలని విజయ్ సేతుపతిని కలిసేందుకు వెళ్లాడు. తన దగ్గర ఉన్న కథతో సినిమా చేయాలని అడిగాడట. అయితే కథ కూడా విజయ్ సేతుపతికి నచ్చిందట.

అయితే నిర్మాత విజయ్ సేతుపతి చెప్పిన కండీషన్లు విని షాక్ అయ్యాడట. తాను సినిమా చేస్తే రోజుకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడట. అయితే దీన్ని తమిళంలో డబ్ చేయోద్దని కండిషన్ కూడా పెట్టాడట. ఇదిలా ఉంటే ప్రమోషన్లకు రానని.. వస్తే మరింత ఛార్జ్ చేస్తానని నిర్మాతకు తెలిపాడట.
అతను కండిషన్లు విని నిర్మాతకు షాక్..
అయితే విజయ్ సేతుపతితో సినిమా తీస్తే.. తెలుగు, తమిళం భాషల్లో క్యాష్ చేసుకోవచ్చని అనుకున్న నిర్మాతకు షాక్ తగిలింది. అయితే ఈ డిమాండ్లను కేవలం తెలుగు సినిమాకే పెడుతున్నాడట విజయ్ సేతుపతి. కథ నచ్చితే సినిమా చేసే విజయ్.. తెలుగులో మాత్రం ఇన్ని డిమాండ్లు ఎందుకు పెడుతున్నాడంటూ.. నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. విజయ్ క్రేజ్ ను క్యాష్ చేసుకుందామని నిర్మాతలు చూస్తే.. నిర్మాతలనే క్యాష్ చేసుకోవాలన్నట్లు ఉంది విజయ్ సేతుపతి ధోరణి. నిజానికి తమిళంలో తక్కువ రెమ్యునరేషన్ కే సినిమాలు చేస్తుంటాడు విజయ్ .. అయితే లాభాల్లో మాత్రం వాటా తీసుకుంటాడు.ఫిదా తెలుగు సినిమా చేయడం కోసం ఇలాంటి కండిషన్లు పెట్టడంతో సదరు నిర్మాత షాక్ కి గురైనట్లు తెలుస్తోంది.































