మనం ఎవరూ ఊహించని యాక్టర్ ఎస్పీ బాలు ఫేవరెట్ అని మీకు తెలుసా..?!

0
465

ఎస్పీ.బాలసుబ్రమణ్యం భౌతికంగా దూరమైన బుల్లితెరపై ప్రతిరోజు ఆయన పాటలతో మనల్ని మేల్కొలుపుతూ, రాత్రుల్లు జోలపాడుతూ.. నిద్ర పుచ్చు తున్నాడు. పాటలతో వంటింట్లో వనితల పనులను తేలిక పరుస్తున్నాడు. ఇంటి నుండి మరో చోటుకు వెళ్ళి నప్పుడు ఆయన పాటలే చెవుల్లో మారు మ్రోగుతున్నాయి.

ఆయన దూరమయ్యాడు అన్నది ఇంకా అవాస్తవమే అనిపిస్తుంది. ఆయన రూపం కళ్లెదుటే కదులుతూ ఆయన పాటే చెవుల్లో మారుమ్రోగుతూ ఉంటే ఆయన మరణం ఇంకా అబద్ధమే అనిపిస్తోంది. ఎస్పీ బాలు పాట వింటూ పెరిగాము, ఆయన పాటతోనే మమేకమయ్యాం. సినిమా పాటలు ఇప్పటి గాయకులు పాడుతూ ఉన్నారు. కానీ మీరు చెప్పినా ఆ పాట వెనుక సంగతులు, విశేషాలు అంత కూర్పుగా, నేర్పుగా ఎవరు చెప్పాలి.

అమ్మలాంటి అచ్చమైన తెలుగు భాషను స్వచ్ఛంగా పలుకుతూ.. వయసులో మీకంటే పెద్ద కళాకారుల గురించి వినమ్రంగా వినయంగా మాట్లాడుతూ.. అవకాశం దొరికితే సభా వేదికలపై బాపు, బాలచందర్, విశ్వనాథ్ వంటి కళాత్మకత దిగ్గజాలకు పాదాభివందనం చేస్తూ, ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా మీ సమకాలికుడైన జేసుదాసు పట్ల ఇసుమంత జలసి లేకుండా పాదాభిషేకం చేసిన మీ కరములు ఏ పూజ చేసుకున్నవో.

మీ నోటి నుండి జాలువారే తెలుగు పదాలు వింటుంటే తేనెలొలికి నట్టుగా చిలుకలు పలికినట్టుగా మనసుకు హాయిని గొలుపుతున్నాయి. అయితే ఎస్పీ బాలసుబ్రమణ్యం చనిపోయే కొద్ది నెలల ముందు మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడగగా.. నా అభిమాన నటుడు అల్లు రామలింగయ్య గారని ఎస్పీ.బాలు చెప్పారు. నిజంగా శంకరాభరణం సినిమాలో హీరో సోమయాజులు కాదు అల్లు రామలింగయ్య గారని చమత్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here