కంగారు పడకండి… ఇదంతా క్యాష్ షోలో సరదాగా జరిగిన సంఘటన.
టీవీ9 న్యూస్ రీడర్ దీప్తి నల్ల మోతు అంటే తెలియని వారు ఉండరు. న్యూస్ రీడర్ గా ఆమె ఎంతో పేరు తెచ్చుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 2 లో దీప్తి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంతా వరకు న్యూస్ రీడర్స్ ఎక్కువ గా ఎవరు ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపించలేదు. బిగ్ బాస్ షో తర్వాత దీప్తి నల్లమోతు బాగా ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు. అంతవరకు అమెలోనే న్యూస్ రీడర్ ని మాత్రమే చూసిన ప్రేక్షకులు ఆమె జీవితాన్ని కూడా చూడడం జరిగింది.

ఆ తర్వత దీప్తి న్యూస్ రీడర్ గానే కాకుండా సోషల్ యాక్టివిటీస్ కూడా జనాల్లో అవేర్నెస్ కల్పిస్తుంది. ఎపుడు అందర్నీ నవ్విస్తూ చలాకి గా ఉంటుంది. అంతే కాకుండా అనేక ఈవెంట్స్ చేస్తూ బిజీగా గడుపుతుంది. తాజగా మల్లెమాల ఎంటైనేమెంట్ వారి ఆధ్వర్యంలో సుమ కనకాల యాంకరింగ్ లో వస్తున్న క్యాష్ ప్రోగ్రాం కి జర్నలిస్ట్ లతో స్పెషల్ షో చేసారు… ఈ షోకి దీప్తి నల్లమోతు, టీఎన్ఆర్, జాఫర్, రోజా లు రావడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు.

ఎపుడు సీరియస్ గా అందర్నీ ప్రశ్నలు అడిగే జర్నలిస్టులు సరదాగా క్యాష్ గేమ్ ఆడడానికి వచ్చారు. మాములుగానే సుమ పంచ్ లు మరియు అల్లరిని ఎవరు తట్టుకోలేరు. ఈ షోలో అందరి కంటే దీప్తి నల్లమోతు బాగా అలరించారని క్యాష్ ప్రోగ్రాం ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది. దీప్తి చేసే అల్లరి భరించలేక ఒకదశలో “నువ్వు నోరు మూసుకుని ఉంటావా…” అని సుమా సరదాగా అనడంతో దీప్తి నల్లమోతు నేను అలా ఉండలేను ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వండి అని చెప్పింది. ఇలా ఎన్నో పంచ్ డైలాగ్స్ తో షో దద్దరిల్లింది.

ఎపిసోడ్ మొత్తం ఇంకెవరికీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వరా అని టిఎన్ఆర్ అనగానే… ఇంకా మాట్లాడను అని వొట్టేయ్యి అని సుమ అనగానే… టిఎన్ఆర్ గారి మీద ఒట్టు ఇంకా మాట్లాడాను అక్కా.. అని బదులిచ్చింది దీప్తి నల్లమోతు..

క్యాష్ స్కూల్ అంటూ నలుగురు పార్టిసిపెంట్స్ ను కూర్చోబెట్టి యాంకర్ సుమ పాటలు చెప్పారు… “మన స్కూల్ పేరు ఏమిటీ క్యాష్ స్కూల్.. అని సుమ అడగగానే… “ఒకె అక్కా…” అంటూ జాఫర్… సుమని ఆటపట్టించాడు. దానికి అందరి మోహంలో నవ్వులే నవ్వులు.

జాఫర్ ముఖా ముఖి ప్రోగ్రానికి ఇమిటేట్ చేస్తూ… నోస్ తో నోస్ అని మరో స్కిట్ చేసారు… ఒక పక్క టిఎన్ఆర్… మరో పక్క జాఫర్ కూర్చొని ఉంటే మధ్యలో సుమ కూర్చుని ఉండగా ఇద్దరు కలిపి సుమని ఫన్నీ గా ఇంటర్వ్యూ చేసారు. “సుమ గారు… ఈ మధ్య మీ ఇంటిమీద టాక్స్ డిపార్ట్మెంట్ వారు దాడి చేసి కొన్ని కోట్లు పట్టుకున్నారంట నిజమేనా….” అని జాఫర్ అడగగా… “అవునండి అందులో ఒక కోటు మీరు వేసుకున్నారంటూ” సుమ అనగానే… ఫ్లోర్ మొత్తం నవ్వుల మోట మ్రోగిపోయింది..

అంతే కాకుండా జఫర్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా క్యాష్ ప్రోగ్రాంలో జాఫర్ ఫ్యామిలీతో కేక్ కట్ చేపించారు క్యాష్ నిర్వాహకులు.

ఈ కాష్ ప్రోగ్రామ్ ప్రోమో మీకోసం…































