కిమ్ ని మించిన నియంత…!! ఎవరు ఈ మహిళా ..? ఎందుకు ఈమె పేరు చెప్తే ఉత్తర కొరియా వణికిపోతుంది

0
300

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో దాదాపు 200 కు పైగా దేశాలు కరోనా వైరస్ బారినపడి కొట్టుమిట్టాడుతున్నారు. కానీ ఉత్తర కొరియా మాత్రం ఆ దేశ అధ్యక్షుడు విషయంలో సతమతమవుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ అనారోగ్యానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. అయితే గత కొంతకాలంగా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న కిమ్ దానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే శస్త్ర చికిత్స చేయించుకొని వారానికి రాకముందే మళ్లీ ఆసుపత్రి పాలయ్యారు. దీంతో కిమ్ ఆరోగ్య విషయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత వారం రోజులుగా పలు విషయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది కిమ్ చేయించుకున్న శస్త్రచికిత్స విఫలమైందని అతని ఆరోగ్యం ప్రమాదంలో ఉందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని అధ్యక్ష భవనం అధికారులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఆ భవనం నుంచి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు కిమ్ ఆస్పత్రి పాలైన మొదటి రెండు రోజులు తెగ హడావిడి చేసిన కొన్ని వెబ్ సైట్లు ఇప్పుడు కిమ్ కి సంబంధించిన ఏ విషయాన్ని కూడా ప్రచురించ కపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది అంతేకాదు మరో విషయం తెరపైకి వచ్చింది. సాధారణంగా అందరు పొలిటికల్ లీడర్స్ లాగానే కిమ్ కూడా తన కుటుంబ విషయాలను చాలా గోప్యంగా ఉంచారు. ఆయన అనారోగ్యం పాలవడంతో ఒక్క విషయం బయటకు వస్తుంది. తాజాగా కిమ్ ఎవరు చేపట్టబోతున్నారు అనే విషయంపై చర్చ మొదలైంది. అయితే సంబంధించిన కొంత మంది సన్నిహితులు మాత్రం ఆయన చెల్లెలు కిమ్ తర్వాత అధికార పగ్గాలు చేపడుతుందని అంటున్నారు. అయితే అసలు కిమ్ చెల్లెలు ఎవరు…? ఏం చేస్తుంది…? ఒకవేళ అధికార పగ్గాలు ఆమె చేతిలో పెడితే నిర్వహించగలదా…? ఇప్పుడు కిమ్ చెల్లెలు ఏం చేస్తుంది అనే విషయాలను తెలుసుకుందాం…

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రపంచానికి తెలుసు. కానీ అతని కుటుంబ సభ్యుల వివరాలు మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. అయితే కిమ్ కి ఒక చెల్లెలు ఉంది. ఆమే..కిమ్‌ యో జోంగ్. గత తొమ్మిదేళ్ల నుంచి కిమ్ దేశాన్ని సమర్థవంతంగా నడిపించడంలో లో కృషి చేస్తోంది యో. కిమ్‌కి ఒక చెల్లెలు కూడా ఉందనే విషయం పదేళ్ల కిందటి దాకా ఎవరికీ తెలియదు. సొంత నీడను సైతం నమ్మని కిమ్‌కి యో మొదట్నుంచీ నమ్మినబంటు అనే చెప్పాలి. వీళ్ళిద్దరికీ వయసులో ఐదేళ్ల తేడా ఉంది. కిమ్, యో లకు అనుబంధం, ఆప్యాయతలు ఎక్కువే. ఇంకా ఇద్దరూ స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో కలిసి చదువుకున్నారు. 2008 వాళ్ల తండ్రి జోంగ్‌ ఇల్‌ చనిపోయాడు. ఆ సమయంలో కిమ్‌ అధ్యక్ష పదవిని చేపట్టారు. ఇక అప్పటి నుండి యో జోంగ్ ఇప్పటివరకు కిమ్ ప్రతి విషయంలోనూ అండగా ఉంటూ వస్తోంది. కానీ ఈ విషయం ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. 2010లో కిమ్ తో కలిసి అతని చెల్లెలు కూడా యో కూడా పార్టీ సమావేశంలో పాల్గొంది. అలా మొదటిసారి ఆమె ఫొటో బయటికొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు కానీ ఏమైందో తెలియదు. 2017 నుంచి కిమ్‌ పక్కన తరచూ కనిపిస్తోంది. గత నెలలో ఉత్తరకొరియా – అమెరికా చర్చల్లో కీలక పాత్ర వహించింది యో జోంగ్‌. అప్పుడు ఆమెను అమెరికా అధ్యక్షుడు మెచ్చుకున్నాడు.

అప్పటివరకు దేశానికి మాత్రమే తెలిసినయో జోంగ్‌ ప్రపంచం దృష్టిలో పడింది. ఆ తరువాత సరిహద్దుల్లో సైనిక కవాతు నిర్వహించినప్పుడు ఉత్తర కొరియానుద్దేశించి దక్షిణకొరియా తీవ్రంగా హెచ్చరించింది. దానికి మొరిగే కుక్క కరవదంటూ ఆమె చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా దుమారం లేపింది. అంతేకాదు యో అద్భుతమైన వ్యూహాలు రచిస్తుంది కుడా. కిమ్‌ ఎవరినైనా కలవాలి అంటే కలిసే వ్యక్తిని దాదాపు ఒక ఇరవై మంది వరకూ తనిఖీ చేయాల్సిందే అలా ఉంటే తప్ప ఎవరినీ కలవని కిమ్ ను…….యో ఏ సమయంలో అయినా అతని వద్దకు నేరుగా వెళ్లి కలుస్తుంది. ఈమెకు మాత్రం తనిఖీలు మినహాయింపు. అంతేకాదు పాలనాపరంగా కిమ్‌ తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆమె పాత్ర కచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇలా తన సోదరుడికి ప్రతి విషయంలో అండగా ఉంటున్న యో నిన్నటి మొన్నటి వరకు ఎవరూ అంతగా పట్టించుకోలేదు కానీ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈమె పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎందుకంటే కిమ్ ఆరోగ్య పరిస్థితి ప్రమాదంలో ఉందని సమాచార వర్గాలు అంటున్నాయి. ఒకవేళ జరగరానిది జరిగితే దేశ పాలన ఎవరు చూసుకుంటారు అనే దానిపై చర్చ మొదలైనట్లే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఎప్పటినుంచో పాలన పరంగా కీలక పాత్ర పోషిస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు సోదరి అయిన యో జోంగ్ ఉత్తర కొరియా పగ్గాలు చేపడుతుందని ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం కిమ్ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే విషయం మాత్రం ఎవరికీ తెలీదు. కానీ అధ్యక్ష పదవి గురించి మాత్రం చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలు చేపడతారు అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here