Sr NTR Chief Security Officer Narasaiah: ఎన్టిఆర్ గారికి ఎన్నో హెలికాప్టర్ ప్రమాదాలు తప్పాయి….: ఎన్టీఆర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసయ్య

0
297

Sr NTR Chief Security Officer Narasaiah: ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఎన్టిఆర్ గారు సినిమాల్లో నటించేటపుడు కంటే సీఎంగా ఉన్నపుడు జరిగిన ఆసక్తికర విషయాలను ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న మాజీ ఐపిఎస్ నరసయ్య గారు తాజాగా ఒక ఇంటర్వ్యులో తెలిపారు. ఆయన ఎంత బొళ మనిషో అలాగే తనతో ఉండేవాళ్లకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు వంటి విషయాలను ఇంటర్వ్యు లో పంచుకున్నారు.

తప్పిన హెలికాప్టర్ ప్రమాదాలు….

ఎన్టిఆర్ గారు చాలా సార్లు దూకుడుగా ఉండేవారు. అప్పట్లో ఒకసారి ఆయన శ్రీశైలం లో జరిగే ఒక కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా హెలికాప్టర్ లో అక్కడికి చేరుకున్నాం. అయితే విమానయాన సంస్థలకు కొన్ని నిబంధనలు ఉంటాయి. సాయంత్రం ఆరు దాటాక హెలికాప్టర్ ప్రయాణాలు చేయరాదు. ఎన్టీఆర్ గారు వచ్చిన హెలికాప్టర్ అంతకుముందు మాజీ సీఎం అంజయ్య గారి హాయంలోనిది . ఆ హెలికాప్టర్ సామర్థ్యం మీద మాకు నమ్మకం లేదు.

అయితే కార్యక్రమం ముగిసే సరికి సాయంత్రం ఆరు దాటి పోయింది. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు హైదరాబాద్ బయలుదేరాలి. అప్పటికే చాలా సార్లు సమయం దాటుతుందని చెప్పిన ఆయన వినిపించుకోలేదు. ఇక పైలట్ చీకట్లో ఏం కనిపించదు ఎలా అనే అయోమయంలో ఉంటే హెలికాప్టర్ ఎక్కువ ఎత్తులో వెళ్లదు అందుకే బయపడ్డాడు , చీకట్లో చెట్లు వంటి వాటికి గుద్దుకుంటే ప్రమాదం అని ఎత్తులో వెళ్ళమని స్త్రైట్ గా వెళ్తుండు ఎక్కడ లైట్స్ కనిపిస్తాయో అది హైదరాబాద్ లేక అంతకు ముందు వచ్చే జడ్చర్ల అయ్యుంటుంది అనుకొమ్మని చెప్పి బయలుదేరాం. అలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి అంటు నరసయ్య ఆయన అనుభవాలను వివరించారు .