Sree reddy : శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో వీడియో ద్వారా ఒక విషయం గురించి మాట్లాడిందంటే వాళ్లపై బూతుల వర్షం కురిసినట్లే. ఇక తాజాగా రోజుకో మలుపు తిరుగుతూ నరేష్, పవిత్ర లోకేష్ ల మ్యాటర్ లో ఇప్పుడు శ్రీ రెడ్డి స్పందించింది. పైకి నీతులు చెబుతూ చేసేవణ్ణి ఇలాంటి పనులే అంటూ ఓ రేంజ్ లో తిడుతూ రెచ్చిపోయింది. ఓ వైపు మెగాస్టార్ ఫ్యామిలీ ని మరో వైపు నరేష్ పవిత్ర లోకేష్ లను తిడుతూ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఆ రోజు నీతులు మాట్లాడిన అపవిత్ర…
మీ టూ ఉద్యమం చేస్తూ మా అసోసియేషన్ ముందు నగ్న ప్రదర్శన సమయంలో మీడియాతో పిచ్చి వాగుడు వాగిన వారిలో పవిత్ర కూడా ఉంది. ఆ ఆరోజు నీతి మాటలు చెప్పిన పవిత్ర ఇపుడు డబ్బులకోసం ఎంత మందితో సంబంధాలు పెట్టుకుంటావు అంటూ రెచ్చిపోయింది. ఇక నరేష్ ఆ రోజున నగ్న ప్రదర్శన చేసిన స్థలాన్ని యాసిడ్ తో క్లీన్ చేయాలంటూ మాట్లాడారు. ఇపుడు నువ్వు చేస్తుందేంటి నాలుగు పెళ్లిళ్లు, ఇక నలభై అక్రమసంబంధాలు పెట్టుకుంటూ నీతులు చెప్తావా… ఆరోజు నా క్యారెక్టర్ ను దిగజార్చిన అందరూ ఇపుడు కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారు.

మీడియా ముందు పరువు పోగొట్టుకుంటున్నారు. నరేష్ భార్య ఎక్కడ మాట్లాడితే నీకెందుకు పవిత్ర అంటూ బూతులు తిట్టింది. ఇక మెగాస్టార్ ఫ్యామిలీని మరోసారి టార్గెట్ చేస్తూ బూతులందుకుంది శ్రీ రెడ్డి. నా గురించి మాట్లాడిన నాగబాబు కూతురికి ఏమైందో అందరికి తెలుసు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు ఎంత బాగా ఆడుతున్నాయో కూడా అందరికి తెలుసు. ఇక ఇప్పుడు నరేష్, పవిత్ర లోకేష్, కరాటే కళ్యాణి వంటి వారి జీవితాలు రాజశేఖర్, జీవితల బతుకులు ఎలా ఉన్నాయో పోలీసులు కేసులతో కర్మ అనుభవిస్తున్నారంటూ బూతులతో రెచ్చిపోయింది.































