Sreeleela – Yash: నటుడు యశ్ నటి శ్రీలకు మధ్య ఉన్నటువంటి ఈ రిలేషన్ గురించి మీకు తెలుసా?

0
40

Sreeleela – Yash: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్నటువంటి పేర్లలో నటి శ్రీల పేరు ఒకటి ప్రస్తుతం ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం తెలుగులో సుమారు 10 సినిమాలను చేతిలో పెట్టుకొని హీరోయిన్గా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె స్కంద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 17వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీలీల పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే కన్నడ నటుడు యశ్ ను శ్రీ లీల బావ అని పిలుస్తారని ఓ విషయం బయటపడింది.

అసలు శ్రీ లీల హీరో యష్ నుబావ అని పిలవడానికి కారణం ఏంటి అసలు వీరిద్దరికీ ఏదైనా రిలేషన్ ఉందా అనే విషయానికి వస్తే వీరిద్దరి మధ్య అలాంటి బంధుత్వాలు ఏమీ లేవని అయితే శ్రీ లీల తల్లి బెంగుళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్ కావడంతో యశ్ భార్య రాధికకు ఈమె రెండు సార్లు డెలివరీ చేశారట. ఈ విధంగా రాధిక తరచూ హాస్పిటల్ కి వెళ్లే సమయంలో రాధికను శ్రీ లీల అక్క అంటూ పిలిచేది.

Sreeleela – Yash: బావ అని పిలుస్తారా…

ఇలా రాధికను అక్క అని పిలవడంతో తన భర్త యష్ ను కూడాబావ అంటూ పిలిచేవారని తెలుస్తోంది. అలా వీరిద్దరి మధ్య బావ మరదళ్ల బంధం ఏర్పడిందని అయితే శ్రీ లీల బయట తనని భావా అని పిల్చకపోయినా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లలో కలిసినప్పుడు మాత్రం తనని ఎంతో ఆప్యాయంగా బావ అంటూ పిలుస్తుందని తెలుస్తుంది. ఇక శ్రీ లీల తల్లి గైనకాలజిస్ట్ కావడంతో ఈమె కూడా మెడిసిన్ చేస్తున్న సంగతి తెలిసిందే.