Sri Ramayanam : మన దేశంలో హిందూ మత విశ్వాసకులు అత్యంత పవిత్రంగా భావించే గ్రంధాలు రామాయణం , మహాభారతం. ఈ రెండు ఇతిహాసాల్లోని అనేక విషయాలు నేటికీ మనం ఆచారిస్తున్నాం. ఏదోక సందర్బంలో మనకు మార్గనిర్దేశనం చేస్తాయి. ఇప్పటి వరకు మనం వింటున్న అనేక నీతి కథల్లో ఎక్కడో ఒకచోట రామయాణం, మహాభారతం స్ఫూర్తి ఉంటుంది. ఇక రామయణం అనగానే రాముడు మనకు చూపించిన మార్గం. రాముడు నడిచిన ధర్మం అనే మార్గంలో మనం ఉండాలని ఆ గ్రంధం సూచిస్తుంది. అలాంటి రామాయణంలోని ఎన్నో పాత్రలు మన నిజ జీవితంలో ఎలా ఉండాలో ఎలాంటి పరిస్థితులైన ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తాయి. మరీ అలాంటి రామయణం లో ఉన్న అత్యంత అధర్ముడు వాలి గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం .

శక్తివంతుడైనా వాలి… అయిన ఆధర్ముడు….
కిష్కింద రాజ్యంలో వాలి, సుగ్రీవులు అనే కవల అన్నదమ్ములు మనకు రామాయణం ద్వారా పరిచయమవ్వుతారు. వీరి జననం చాలా వింతగా ఉంటుంది. వృక్షవజస్సు అనే కిష్కిందకు చెందిన రాజు సరస్సులో స్నానం చేసి పైకి రాగానే అమ్మయిగా మారీ ఇంధ్రుడి తేజస్సు వలన వాలి, సూర్యుని తేజస్సు వలన సుగ్రీవుడుకి జన్మిస్తారు. సుగ్రీవుడు ఎంతో ప్రకాశవంతమైన వ్యక్తి తెలివైనవాడు. ఇక వాలి అత్యంత శక్తివంతుడు. తనకు ఇంధ్రుడు ఇచ్చిన హారం వల్ల శక్తివంతుడైనా ఆ తరువాత ఘోర తపస్సు చేసి బ్రహ్మ ను ప్రసన్నం చేసుకున్నాడు. తను ఎవరితో యుద్ధం చేసిన ఎదుటి వ్యక్తి శక్తిలో సగం తనకు వచ్చేలా వరం పొందడు. అలా తన ప్రత్యర్థి బలహీన పడితే వాలి మరింత బలవంతుడై యుద్ధం లో గెలిచేవాడు. ఒకసారి మాయవి అనే రాక్షసుడితో పోటీపడిన వాలి అతడిని ఓడించిగా అతను పారిపోయిన వదల కుండా వెంబడించి ఒక గుహ లోకి వెళ్తాడు.

ఆ తరువాత కొన్నిరోజులు గడిచిన వాలి బయటికి రాకపోయే సరికి సుగ్రీవుడు వాలి మరణించడని భావించి ఆ గుహని ముసివేయించి రాజుగా పట్టాభిషేక్తుడు అవుతాడు. ఇక వాలి మళ్ళీ తిరిగివచ్చే సమయానికి రాజుగా సుగ్రీవిడిని చూసి కుట్రతో మాయవి ద్వారా నా అడ్డుతొలగించి రాజ్యము ఏలుతున్నాడు అనే అనుమానం తో సుగ్రీవుడితో యుద్ధం చేసి అతడిని తరిమి అతని భార్యను చెర పడతాడు. అలా కూతురుగా భావించాల్సిన తమ్ముడి భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఇక రావణాసురుడినే ఓడించిన వాలి తన ఆధర్మం వల్లే రాముడి చేతిలో ఓడిపోయాడు.































