Sri Reddy: అల్లు అర్జున్ మెగా ముసుగు వేసుకోరు… సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి!

0
26

Sri Reddy: తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే సంచలన తార శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీ గురించి లేదా రాజకీయ నాయకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఈమె ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కువగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తారనే సంగతి మనకు తెలిసిందే.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నాగబాబు తర్వాత ఈమె చిరంజీవి గారి పట్ల విమర్శలు చేస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే ఈమె తాజాగా అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకున్నటువంటి తరుణంలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ విధంగా శ్రీరెడ్డి స్పందిస్తూ కంగ్రాట్యులేషన్స్ అల్లు అర్జున్ ఆన్ విన్నింగ్ బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ అంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా అల్లు అర్జున్ లో తనకు నచ్చే విషయం గురించి కూడా ఈమె తెలిపారు. అల్లు అర్జున్ మెగా మూసుగు వేసుకొని సినిమాలు చేయరు తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటారు. తనలో నాకు ఈ విషయం బాగా నచ్చుతుందని శ్రీ రెడ్డి తెలిపారు.

Sri Reddy: అల్లు అర్జున్ తన పని తాను చేసుకుంటూ పోతారు….

ఇలా ఈమె అల్లు అర్జున్ ని పొగుడుతూ కూడా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడటంతో మెగా ఫాన్స్ ఈమె గురించి ఈమె చేసిన వ్యాఖ్యల గురించి విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా తరచూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఈమె పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు. అయితే తన గురించి ఎవరు ఏమి మాట్లాడినా డోంట్ కేర్ అనేలాగే శ్రీరెడ్డి వ్యవహార శైలి ఉంటుందని చెప్పాలి.