Sri Reddy: శ్రీరెడ్డి.. చాలా మందికి తెలిసిన పేరు. వివాదాలకు దాదాపు దగ్గరగా ఉంటారు. సినిమా పరిశ్రమలో జరిగే విషయాలపై ఎక్కువగా మాట్లాడుతూ.. ఆమె హైలెట్ అవుతూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఓ ఉద్యమాన్నే నడిపారు.

తెలుగు పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాడింది. అంతే కాదు.. ఆమె పోరాటానికి చాలామంది మద్ధతు కూడా తెలిపారు. టాపిక్ ఏదైనా ఆమె ముక్కుసూటిగా ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఇక ఆమె నటిగా ఎక్కువగా పాపులర్ అయిన దాని కంటే.. ఎక్కువగా వివాదాల కారణంగానే పాపులారిటీ తెచ్చుకున్నారు.

రాజకీయాల పరంగా కూడా ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటే ఎంతో ఇష్టం. ఎవరైనా అధికార పక్షంపై విమర్శలు చేస్తే.. పురుష పదజాలంతో వారిపై విరుచుకు పడుతుంది. ఇక ప్రతి పక్షపార్టీలపై చీల్చి చెండాడుతూ ఉంటుంది.
యూ ట్యూబ్ లో సునామి..
అయితే శ్రీ రెడ్డి మారో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా పవన్ కళ్యాన్ హీరోగా.. భీమ్లానయక్ సినిమా కు సంబంధించి ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్ పై శ్రీ రెడ్డి స్పందించింది. ఆ ట్రైలర్ అనుకున్నంతగా లేదని.. యవరేజ్ మాత్రమే అంటూ శ్రీరెడ్డి ట్వీట్ చేసింది. అంతే కాకుండా.. నవ్వుతున్న ఎమోజీ పెట్టీ మరో ట్వీట్ చేసింది.అయితే ఆమె చేసిన ట్వీట్ తెగ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెపై ఓ రేంజ్ లో విరుచుకు పడింది. ఇదిలా ఉండగా.. సోమవారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా.. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో వాయిదా వేశారు. అయితే యూట్యూబ్ లో మాత్రం ఈ ట్రైలర్ ప్రోమో సునామీనే స్పష్టిస్తోంది. ట్రైలర్ వైవిధ్యంగా ఉండడంతో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. మొట్టమొదటిసారి పవన్ రానా కాంబోలో వస్తున్న భీమ్లా నాయక్ చిత్రం పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదలపై పవన్ అభిమానులే కాకుండా.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.































