Sri Reddy: సంచలన సినీ తార శ్రీరెడ్డి ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుందనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈమె సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలుపుతూ వచ్చారు. అయితే వైసీపీ పార్టీ ఈసారి ఘోరంగా ఓటమిపాలు కావడంతో తెలుగుదేశం కార్యకర్తలు భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.

ఇలా ట్రోల్స్ చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లకు కూడా పాల్పడుతూ రాష్ట్ర మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. అయితే వైసిపి పై టిడిపి నేతలు కార్యకర్తలు దాడికి పాల్పడుతున్న వారందరికీ తన స్టైల్ లోనే ఎదురు సమాధానం చెబుతున్నారు శ్రీరెడ్డి.
తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈమె ఒక సవాల్ విసిరారు. గతంలో వైసిపి ఓడిపోతే తాను వైజాగ్ బీచ్ లో బట్టలూడదీసి తిరుగుతానని చెప్పారు. అయితే ఇప్పుడు వైసిపి ఓడిపోయింది కదా ఎప్పుడు వైజాగ్ బీచ్ వస్తున్నావు అంటూ పలువురు ఈమెపై ట్రోల్ చేస్తున్నారు అయితే ఈ వీడియో పై స్పందించిన శ్రీరెడ్డి సవాల్ విసిరారు.
కొంతమంది పావలా బిళ్ళలు పప్పు బిళ్ళలు నేనేదో సవాల్ విసిరానని నాపై ట్రోల్స్ చేస్తున్నారు. నేను నా సోషల్ మీడియా ఖాతాలో ఏ ఒక్క పోస్టు కూడా డిలీట్ చేయలేదు. ఒకవేళ నేను వైజాగ్ బీచ్ లో బట్టలూడదీస్తానని సవాల్ చేసినట్టు మీరు నిరూపిస్తే ఖచ్చితంగా నేను వైజాగ్ బీచ్ వచ్చి నగ్నంగా తిరుగుతానని ఈమె సవాల్ విసిరుతూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
40 శాతం ఓటింగ్..
మీరు ట్రోల్ చేయాలనుకుంటే.. నేను మీకు కరెక్ట్ పర్సన్‌ని కాదు. నేను భయపడేదాన్ని కాదు. అలా భయపడేదాన్నైతే.. మీ ముందు ఇలా ధైర్యంగా నిలబడేదాన్ని కాదు. ఓడిపోయినందుకు బాధగా ఉంటుంది నేను కూడా మనిషినే కానీ బాధపడుతూ అలాగే కూర్చోమని తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యామని తెలిపారు.వైసీపీ సింగిల్‌గా వచ్చి 40 శాతం ఓటింగ్ వచ్చింది. అది మర్చిపోవద్దు అంటూ ఈమె కూటమి కార్యకర్తలకు సవాల్ విసిరుతూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.



























