Sree Reddy: తెలుగు సినీ ప్రేక్షకులకు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె సుపరిచితమే. శ్రీరెడ్డి తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో, వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి బాగా పాపులర్ అయ్యింది. ఇక అప్పటి నుంచీ ఏదో ఒక విషయంలో ఆమె తరచుగా వార్తలు నిలుస్తూనే ఉంది. తనకు సంబంధం లేని విషయాలలో కూడా ఆమె కలుగజేసుకొని మాట్లాడి లేనిపోని వివాదాలను తెచ్చుకుంటూ ఉంటుంది.

అంతేకాకుండా సమాజంలో జరిగే పలు విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ నెటిజెన్స్ నుంచి ట్రోలింగ్స్ ను సైతం ఎదుర్కొంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ రెడ్డి ఒక విషయంలో క్షమించండి అంటూ పశ్చాత్తాప పడింది. తాను చేసిన తప్పును అంగీకరిస్తూ క్షమించమని కోరుతూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది. అయితే అప్పట్లో కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీ రెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో సెన్సేషన్ అవడమే కాకుండా ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మ పై అసభ్య పదజాలంతో దూషించింది.

అయితే ఆమె చేస్తున్న ఉద్యమం మరింత తీవ్రతరం అవ్వాలి అంటే పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టమని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆమెకు సలహా ఇచ్చారు అంటూ ఆమె బాంబు పేల్చింది. ఇదే విషయంపై తాజాగా ఆమె అంజనమ్మను క్షమించమని కోరుతూ వీడియోని రిలీజ్ చేసింది. ఆడవారి కోసం చేసే ఉద్యమానికి న్యాయం జరగడం కోసం తనకు ఒక పెద్ద మనిషి ఇచ్చిన సలహాతో చిరంజీవి గారి తల్లి అంజనమ్మను అసభ్య పదజాలంతో చెప్పాల్సివచ్చింది.. అయితే ఆ ఇష్యూతో ఎటువంటి సంబంధం లేని ఆమెను తిట్టడం ముమ్మాటికీ తప్పే.. ఆ విషయంలో నేను చాలా శిక్షను అనుభవించాను.
బుద్ధి గడ్డితిని ఇలా చేశాను..
ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నానని ఆమె తెలిపింది.. అదేవిధంగా అన్యాయంగా ఆమెను తిట్టడం తప్పే ఒప్పుకుంటున్నాను.. నేను తప్పు చేశాను.. బుద్ధి గడ్డితిని అలా తిట్టాను.. దయచేసి పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి అంటూ శ్రీరెడ్డి కోరింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంజనమ్మ ను తిట్టిన తర్వాత సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ని ఎదుర్కొన్నాను. కొంతమంది కాల్ చేసి మరీ అది పద్ధతి కాదు, అలా చేసి ఉండకూడదు అని కూడా చెప్పారు.. ఆ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.
నన్ను క్షమించండి "అంజనమ్మ" ???????????????????? pic.twitter.com/fnBvee9qRt
— Sri Reddy (@MsSriReddy) January 22, 2022



























