Sri Reddy: బిగ్ బాస్ 5 సీజన్ ముగిసిన తర్వాత కూడా దీప్తి సునయన- షణ్ముఖ్ జశ్వంత్ బ్రేకప్ పై విషయం ఇప్పటికి నెట్టింట్లో ట్రెండింగ్ గానే ఉంది. బ్యూటిపుల్ పేయిర్ గా ఉన్న వీరిద్దరు విడిపోవడం వాళ్ల ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఐదేళ్లు రిలేషన్ షిష్ లో ఉన్న వీరిద్దరు విడిపోవడానికి బిగ్ బాస్ ఎపిసోడ్స్, సిరినే కారణం అంటూ ఇప్పటికే నెటిజెన్ల ట్రోలింగ్ మొదలైంది.

బిగ్ బాస్ హౌజ్ లో సిరికి, షన్నూ దగ్గరగా ఉండటం, కిస్సింగ్, హగ్గింగులు చాలా మందికి నచ్చలేదు. వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కన్నా వేరే ఏదో రిలేషన్ ఉందని జనాలు అనుమానించారు. దీని కారణంగానే ఇటీవల దీప్తి, షన్ముఖ్ కు బ్రేకప్ చెబుతూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

ఇదిలా ఉంటే ఈ వ్యవహరంపై వివాదాస్పద నటి శ్రీ రెడ్డి స్పందించింది. మీరిద్దరు విడిపోవడం చాలా బాధగా ఉంది అని అంటూనే.. బిగ్ బాస్ వ్యవహారమే మీ మధ్య గ్యాప్ పెంచేందుకు కారణమైందని అంది. అయితే షన్నూ బిగ్ బాస్ లో చేసిందానిక బ్రేకప్ చెబితే.. గతంలో నువ్వు కూడా బిగ్ బాస్ షోకు వెళ్లావని, కొందరితో సన్నిహితంగా మెలిగావని దాని సంగతేంటని ప్రశ్నించింది.
షన్నూతో పెళ్లి కాలేదు కాబట్టి …
నీవరకు వచ్చే సరికి ఇది తప్పుకాదా అని అంది శ్రీరెడ్డి. షణ్ముఖ్ తో ఐదేళ్లు రిలేషన్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశామని చెబుతున్నావు. ఇలాంటి చిన్న విషయాలకే బ్రేకప్ చెప్పావా…అని శ్రీ రెడ్డి స్పందించారు. షన్నూతో పెళ్లి కాలేదు కాబట్టి బ్రేకప్ చెప్పావు.. అదే పెళ్లి అయితే షన్నూను ఇలాగే వదిలి వేళ్లేదానివా అని ప్రశ్నించింది. ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉన్నప్పుడు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. టాటూలపై కూడా శ్రీరెడ్డి స్పందించింది. గతంలో టాటూలు వేయించుకున్న వారంతా విడిపోయారని.. దీప్తి సునయన కూడా టాటూలు వేయించుకుంది.. ఇప్పుడు అది రిమూవ్ చేయించుకోవాలని అనుకుంటుంది. మీపై మీకు నమ్మకం లేకపోతే టాటూలు వేయించుకోకండి’ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. మనం ఎంత చేసినా భారతీయులమని మరిచిపోవద్దు.. జీన్స్ ఫ్యాంట్, టీ షర్ట్ వేసుకున్నా మన సంస్కృతి, సాంప్రదాయాలు మర్చిపోకూడదని హితవు పలికింది.

































