Featured
Sridhar : ఎన్టిఆర్ తో ఆ సినిమా చేయడం వల్ల శ్రీధర్‌కు వచ్చే హీరో వేషాలు కూడా రాకుండా పోయాయా!?
Published
2 years agoon
ఎన్టిఆర్ వల్ల శ్రీధర్‌కు వచ్చే హీరో వేషాలు కూడా రాకుండా పోయాయి నంటే ఎవరైనా నమ్మగలరా..అవును ఇది వాస్తవం. నందమూరి తారక రామారావు హీరోగా నటించిన
ఎన్నో సినిమాలతో ఎంతో మంది కొత్త నటీ నటులు సాంకేతిక నిపుణులు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. వారిలో చాలామంది సక్సెస్ సాధించారు కూడా. ఎన్టిఆర్ సొంత నిర్మాణ సంస్థలో తీసిన సినిమాల ద్వారా కూడా చాలా మందికి ఆయన లైఫ్ ఇచ్చారు. అప్పటి తరం వారెవైరైనా ఇప్పుడు ఉంటే ఎన్టిఆర్ వల్ల వారు సహాయం పొందిన వారైతే ఖచ్చితంగా ఆ విషయాలను, సందర్భాలను చాలా గొప్పగా చెప్పుకుంటారు.
అలాంటి ఎన్టిఆర్ మూలంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా వెలగాల్సిన ఓ నటుడు మాత్రం సక్సెస్ కాలేకపోయారు. దురదృష్ఠవశాత్తు అది ఎన్టిఆర్ సినిమాల వల్లే కావడం ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఆ నటుడెవరో కాదు ముత్యాల ముగ్గు సినిమాతో మంచి గురింపు ..పేరు తెచ్చుకున్న శ్రీధర్. ఆయన అసలు పేరు సూరపనేని శ్రీధర్. 1939 డిసెంబర్ 21న కృష్ణా జిల్లా, ఉయ్యూరు దగ్గర్లోని కుమ్మమూరు గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. అప్పటి నటీ నటుల మాదిరిగా శ్రీధర్ కూడా నాటక రంగంలో పలు నాటకాలు వేసి రంగస్థలం మీద పాపులర్ అయ్యాడు. అలా పాపులారిటీ తెచ్చిన నాటకాలు పరీక్ష, చీకటి తెరలు, అభాగ్యులు, సాలెగూడు, మండేకొండలు వంటివి. వీటిలో అతను పోషించిన ప్రధాన పాత్రలకు మంచి ప్రశంసలు దక్కాయి. దాంతో తల్లా? పెళ్లామా? సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు.
నటనపరంగా శ్రీధర్‌కు ముందు నుంచే మంచి పేరు తెచ్చుకున్నాడు. నటుడుగా మూడు దశాబ్దాలపాటు మంచి పాత్రలు పోషించి దాదాపు 150 సినిమాలలో నటించాడు. శ్రీధర్‌కు తెలుగులో బాగా పేరు తెచ్చిన సినిమా ముత్యాల ముగ్గు. ఈ సినిమాతో గుర్తింపు పొందిన శ్రీధర్ ఎక్కువగా అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ నటించిన దాదాపు చాలా సినిమాలలోనూ మంచి పాత్రలు పోషించాడు. ఇండస్ట్రీలో ఇతనికి బాగా సపోర్ట్ చేసింది అంటే కృష్ణ గారే.
Sridhar : ఆ సినిమా నటించడం వల్లే శ్రీధర్ కు హీరో అవకాశాలు తగ్గాయా?
జస్టిస్ చౌదరి సినిమాలో ఎన్టీరామారావు కొడుకుగా నటించి ఆకట్టుకున్నాడు. శ్రీధర్ మంచి టాలెంటెడ్ హీరో. కానీ ఆయనకు హీరోగా సరైన అవకాశాలు దక్కలేదు. అయినా ఏనాడు వేషాలకోసం నిర్మాతల ఆఫీసుల చుటూ, దర్శకుల చుట్టూ తిరిగింది లేదట. అవకాశం వచ్చిన సినిమాలలో పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టి నటించాడు. ఇక మరో స్టార్ హీరో శోభన్ బాబు ఇన్స్పిరేషన్తో నటుడిగా ఉండగానే రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టి..బాగా సంపాదించారు. ఈ వ్యాపారం తనకు బాగా కలిసొచ్చింది.
హీరోగా నటిస్తున్న సమయంలో శ్రీధర్ తోటి ఎన్టిఆర్ తన స్వంత చిత్రం శ్రీరామ పట్టాభిషేకంలో గుహుడు వేషం వేయించారు. ఇది తనకు బాగా కలిసొస్తుందనుకున్నాడు. కానీ ఇదే అవకాశాలు లేకుండా చేస్తుందని మాత్రం ఊహించలేదు. అంతకు ముందు ఎన్టిఆర్ గుహుడు వేషానికి డ్రైవర్ రాముడులో సెకెండ్ హీరో వేషానికి ఏదో లింకుపెట్టి ఇచ్చారట. అయితే డ్రైవర్ రాముడు సూపర్ హిట్ సాధించింది. అయినా శ్రీధర్ కు హీరో అవకాశాలు దక్కలేదు. ఈ రకంగా శ్రీధర్‌కు సూపర్ హిట్ చిత్రాలలో నటించినప్పటికీ లాభం లేకుండా పోయింది. అతను నటించిన చిత్రాలలో అమెరికా అమ్మాయి, అడవి రాముడు, జస్టిస్ చౌదరి, కరుణామయుడు, ఈనాడు, బొమ్మరిల్లు, సీతా మహాలక్ష్మీ, యశోధకృష్ణ వంటి చిత్రాలు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఇక శ్రీధర్ నటించిన ఆఖరి సినిమా నాగార్జున – శ్రీదేవి జంటగా సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ రూపొందించిన
గోవిందా గోవిందా.
You may like
C. Kalyan : ఆ ఒక్క సినిమా వల్ల ఏడు కోట్లు నష్టపోయాను… నందమూరి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి తేడా అదే… : సి. కళ్యాణ్
Ntr: మరో కొత్త కారును కొనుగోలు చేసిన ఎన్టీఆర్.. కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Ntr: బాలీవుడ్ కి షాక్ ఇస్తున్న తారక్.. వార్ 2 రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Jr. Ntr: ఎన్టీఆర్ ఆ సినిమా అంటే తన తల్లికి అంత ఇష్టమా.. ఎందుకంత స్పెషల్?
Ntr: నేను ఈ స్థాయిలో ఉండడానికి ఆ ఇద్దరు మహిళలే కారణం.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!
Ntr: ఎన్టీఆర్ కి ఉన్న ఈ అలవాటు ఏ టాలీవుడ్ హీరోకి లేదు తెలుసా.. ఆ విషయంలో తారక్ గ్రేట్?
Featured
Rana: మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ పై జోక్స్ వేసిన రానా… ఫైర్ అయిన హరీష్ శంకర్?
Published
16 hours agoon
6 November 2024By
lakshanaRana: ఇటీవల రవితేజ హీరోగా డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్ ఈ సినిమా ఎన్నో అంచనాలను ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఏ మాత్రం కలెక్షన్స్ లేకపోవడంతో డిజాస్టర్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా డిజాస్టర్ గురించి రానా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దుబాయిలో జరిగిన ఐఫా ఉత్సవం అవార్డ్స్ ఫంక్షన్ లో రానా, తేజ సజ్జా జోకులు వేశారు. రానాతో పాటు ఈ కార్యక్రమానికి తేజ సజ్జ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వీరిద్దరూ సరదా సరదాగా పలు సినిమాల గురించి మాట్లాడారు.
బచ్చన్ గారు ఈ ఏడాది హైయెస్ట్ హై చూశారు లోయస్ట్ లో చూశారు అని రానా అంటే హైయెస్ట్ అయితే కల్కి మరి లోయస్ట్ లో ఏమిటి అని అడిగితే అదే ఈ మధ్య వచ్చింది కదా మిస్టర్ అంటూ ఉండగా తేజా సజ్జ ఏ అలా మాట్లాడొద్దు అంటూ ఆపారు. అయితే ఇక్కడ మిస్టర్ బచ్చన్ సినిమా గురించి పూర్తిగా చెప్పకపోయినా మిస్టర్ అని చెప్పడంతో కచ్చితంగా రవితేజ సినిమా డిజాస్టర్ గురించి మాట్లాడారని తెలుస్తుంది.
అన్ని రోజులు ఒకేలా ఉండవు..
ఇక ఈ విషయంపై రవితేజ అభిమానులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ అన్న ఎవరైతే ఇలా మీ సినిమాల గురించి మాట్లాడారో వారే క్లాప్స్ కొట్టాలి అంటే మీరు కచ్చితంగా హిట్ సినిమా చేయాలి అంటూ కామెంట్ చేయగా మరికొందరు డైరెక్టర్ హరీష్ శంకర్ ని టాగ్ చేశారు. రవితేజ గారితో ఒక సినిమా చేయాలి మళ్లీ మేము కాలర్ ఎగరేయాలి దీనికి మీ రిప్లై కావాలన్నా అంటూ పేర్కొన్నారు. దానికి హరీష్ శంకర్ ఎన్నో విన్నాను తమ్ముడు అందులో ఇదోటి. అన్ని రోజూలు ఒకేలా ఉండవు, నాకైనా ఎవరికైనా అంటూ రాసుకొచ్చారు.
Featured
Sai pallavi: సాయి పల్లవికి కొత్త బిరుదు ఇచ్చిన నాగచైతన్య… తనతో కష్టం అంటూ కామెంట్స్?
Published
16 hours agoon
6 November 2024By
lakshanaSai pallavi: సినీ నటుడు నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కాబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు నాగచైతన్య నటి సాయి పల్లవి గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. అంతేకాకుండా ఆమెకు సరికొత్త బిరుదు కూడా ఇచ్చారు. ఇప్పటికే సాయి పల్లవిని నేచురల్ బ్యూటీ అని లేడీ పవర్ స్టార్ అనే బిరుదులతో పిలుస్తారు తాజాగా బాక్సాఫీస్ క్వీన్ అంటూ మరో బిరుదుని ఇచ్చారు.
సాయి పల్లవి సినిమా సెట్ లో ఉంటే కేవలం తన పాత్ర గురించి మాత్రమే కాకుండా నా పాత్ర గురించి కూడా ఎంతో క్లారిటీతో ఉంటూ నాకు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటారని తెలిపారు. ఇక సాయి పల్లవి తో నటించాలన్న కాస్త కష్టంగా ఉంటుంది.ఆమెతో కలిసి డాన్స్ చేయాలంటే నాకు కాస్త భయం వేస్తుంది అంటూ నాగచైతన్య ఈ సందర్భంగా సాయి పల్లవి నటన డాన్స్ పై ప్రశంసలు కురిపించారు.
డాన్స్ చేయాలంటే భయం..
గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్ గురించి వినగానే నాకు చేయాలనిపించింది. తండేల్ చాలా గొప్ప చిత్రం అవుతుంది. నా పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులను కలిశానని అన్నారు. ఈ సినిమా జాలరి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న సంగతి తెలిసిందే.
Featured
Allu Aravind: అయ్యయ్యో…ఆ స్టార్ హీరోయిన్ ను బన్నీకి చెల్లిని చేసిన అల్లు అరవింద్?
Published
18 hours agoon
6 November 2024By
lakshanaAllu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అరవింద్ తాజాగా తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి ఏడో తేదీ విడుదలకు సిద్ధమైంది.
ఇలా విడుదల తేదీన ప్రకటించడం కోసం చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి. ఇటీవల సాయి పల్లవి అమరన్ సినిమాలో నటించిన విషయం తెలిసినదే. ఈ సినిమాలో సాయి పల్లవి నటనకి మంచి మార్కులే పడ్డాయి.
ఈ సినిమా గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇటీవల తాను అమరన్ సినిమా చూశాను. సాయి పల్లవి తన నటనతో అందరిని అదరగొట్టేసింది. చివరిగా కన్నీళ్ళతో బరువెక్కిన హృదయంతో బయటకు వచ్చాను కారులో కూర్చుని అదే ఎమోషన్ లో సాయి పల్లవికి ఫోన్ చేసి మాట్లాడానని అల్లు అరవింద్ తెలిపారు.
కూతురితో సమానం..
నాకు కూతుర్లు లేరు కూతురు కనుక ఉండి ఉంటే సాయి పల్లవి లాగే ఉండాలని కోరుకుంటాను ఆమె నాకు కూతురుతో సమానం అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అయ్యయ్యో ఈ స్టార్ హీరోయిన్ పట్టుకొని బన్నీకి చెల్లిని చేశారు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు
Rana: మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ పై జోక్స్ వేసిన రానా… ఫైర్ అయిన హరీష్ శంకర్?
Sai pallavi: సాయి పల్లవికి కొత్త బిరుదు ఇచ్చిన నాగచైతన్య… తనతో కష్టం అంటూ కామెంట్స్?
Allu Aravind: అయ్యయ్యో…ఆ స్టార్ హీరోయిన్ ను బన్నీకి చెల్లిని చేసిన అల్లు అరవింద్?
Samantha: నీ ప్రేమే నాకు బలం.. సంచలనంగా మారిన సమంత పోస్ట్?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
Aara Mastan: బాబు ఈవీఎం సీఎం.. సంచలనం రేపుతున్న ఆరా మస్తాన్ కామెంట్స్!
Saripoda Ee Dasara: ఈ దసరా పండుగకు స్పెషల్ ఈవెంట్.. ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదుగా!
Pawan Kalyan: ఆ భయంతోనే జగన్ కంటే ముందుగానే అక్కడికి వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్!
YS Jagan Mohan Reddy: ఇకపై మా వాళ్లు ఆ బుక్ మైంటైన్ చేస్తారు.. రెడ్ బుక్ కు పోటిగా కొత్త బుక్?
Adimulam: సూపర్ గా ఉన్నావు… మరో మహిళతో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం!
Trending
- Featured3 weeks ago
Aara Mastan: బాబు ఈవీఎం సీఎం.. సంచలనం రేపుతున్న ఆరా మస్తాన్ కామెంట్స్!
- Featured4 weeks ago
Saripoda Ee Dasara: ఈ దసరా పండుగకు స్పెషల్ ఈవెంట్.. ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదుగా!
- Featured2 weeks ago
Pawan Kalyan: ఆ భయంతోనే జగన్ కంటే ముందుగానే అక్కడికి వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్!
- Featured4 weeks ago
YS Jagan Mohan Reddy: ఇకపై మా వాళ్లు ఆ బుక్ మైంటైన్ చేస్తారు.. రెడ్ బుక్ కు పోటిగా కొత్త బుక్?
- Featured3 weeks ago
Adimulam: సూపర్ గా ఉన్నావు… మరో మహిళతో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం!
- Featured4 weeks ago
Ratan Tata: రతన్ టాటా ఆస్తులు విలువ ఎంత..ఆస్తికి వారసులు ఎవరు?
- Featured2 weeks ago
Pawan Kalyan: ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ ను చూసా.. పవన్ పై సీఎం చంద్రబాబు కామెంట్స్!
- Featured4 weeks ago
Rathan Tata: రతన్ టాటా మృతి… వైరల్ అవుతున్న టాటా ఆఖరి పోస్ట్!