యాంకర్ శ్రీముఖి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై యాంకర్ గా దూసుకుపోతోంది.యాంకర్ తన మాటలతో మాయ చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగు బుల్లితెర పై ఎంతో మంది యాంకర్లు ఉన్నా తనకంటూ మంచి గుర్తింపును ఏర్పరుచుకుంది.బుల్లితెర పైనే కాకుండా వెండి తెరపై కూడా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇక శ్రీముఖి సోషల్ మీడియాలో హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో శ్రీముఖి కి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే. ఈమె అభిమానులు ఈమెను ముద్దుగా రాములమ్మ అని పిలుచుకుంటారు.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా విభిన్నమైన డ్రెస్సులో ఫోటో షూట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ షో ద్వారా శ్రీముఖి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇటీవలే శ్రీముఖి క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అలాగే నితిన్ నటించిన మాస్ట్రో సినిమాలో కూడా శ్రీ ముఖి నటించింది.

ఇదిలా ఉంటే తాజాగా శ్రీముఖి సోషల్ మీడియాలో స్టన్నింగ్ లుక్ లో కళ్ళు చెదిరేలా లంగా వోనీలో కనిపించి కనువిందు చేసింది. లంగా వోని ధరించి అందుకు తగ్గట్టుగా ఆభరణాలు ధరించడంతో శ్రీముఖి అందం మరింత రెట్టింపు అయినట్టు తెలుస్తోంది. ఈ ఫోటోల్లో రాములమ్మ చూడముచ్చటగా కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.
































