Sri Reddy: హీరోయిన్ తో ఆ కామ వేషాలు ఏంటి చిరు.. చిరంజీవిని ఏకి పారేసిన శ్రీ రెడ్డి?

0
153

Sri Reddy: శ్రీ రెడ్డి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే ఈమె గతంలో తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచేవారు అయితే ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డి వివాదాలకు కాస్త దూరంగా ఉంటూ సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వంట వీడియోల ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు అయితే అప్పుడప్పుడు ఈమె సినిమాల గురించి రాజకీయాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.

ఇలా సినీ రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే శ్రీ రెడ్డి తాజాగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ క్రమంలోనే భోళా శంకర్ ప్రీరిలీజ్ వేడుకలో భాగంగా చిరంజీవి కీర్తి సురేష్ పట్ల కాస్త చిలిపిగా రొమాంటిక్గా వ్యవహరించిన తీరు అందరిని కాస్త విష్మయానికి గురిచేస్తుంది.

కీర్తి సురేష్ చెయ్యి విడవకుండా పట్టుకోవడం ఆమె బుగ్గలను గిల్లడం వంటివి కొందరు జీర్ణించుకోలేకపోయారు.ఈ విషయంపై శ్రీ రెడ్డి స్పందిస్తూ సినిమాలో చెల్లెలుగా నటించింది నిజజీవితంలో నీ కూతురితో సమానమైనటువంటి నటి పట్ల నువ్వు వేస్తున్నటువంటి ఈ కామ వేషాలు ఏంటి చిరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రశ్నించారు.

Sri Reddy: గద్దర్ గురించి మాట్లాడవచ్చుగా…

ఈ విధంగా కీర్తి సురేష్ తో ఇలా వ్యవహరించే బదులు వేదికపై గద్దర్ గారికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఆయన గురించి రెండు మంచి మాటలు మాట్లాడి ఉంటే నీ కీర్తి ప్రతిష్టలు నీ గౌరవం మరింత పెరిగేది కదా అంటూ ఈమె తీవ్రస్థాయిలో చిరంజీవి గారిని తప్పుపడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా శ్రీరెడ్డి మెగాస్టార్ పై విమర్శలు చేయడంతో మెగా ఫ్యాన్స్ రియాక్టర్ తో శ్రీరెడ్డిని భారీగా ట్రోల్ చేస్తున్నారు.