తెలుగు దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీనిలో Jr NTR, రామ్ చరణ్ , అలియా భట్ లు నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తర్వాత చిత్ర బృందం దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉంది .

ముంబై , చెన్నైలో దీని గురించి మాట్లాడిన తర్వాత.. మళ్లీ ఈ బృందం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్‌ని నిర్వహించింది. RRR ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులను ధరించి.. మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇక్కడ సినిమాలో తెరవెనుక జరిగిన కొన్ని వినోదాత్మక సన్నివేశాల గురించి చెప్పుకుంటూ కాస్త నవ్వులు పూయించారు. నందమూరి తారక్, రామ్ చరణ్ పై మీడియా వేదికగా జక్కన్న ఫిర్యాదు చేశాడు.
షూటింగ్ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని.. చెబుతుండగా.. ఒక్కసారిగా ఎన్టీఆర్ జక్కన్నను గిల్లగా అక్కడ నుంచి లేచి వెళ్లి.. నిలబడి మరీ చెబుతాడు రాజమౌళి. షూటింగ్ దాదాపు 300 రోజులు అనుకుంటే.. అందులో 25 రోజులు వీళ్లిద్దరి వల్లే వృధా అయ్యాయని చెప్పాడు.
వీరిద్దరికీ 30 ఏళ్ల వయస్సు దాటింది.. పెళ్లియింది.. వెనకాల లక్షల్లో.. కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్నా.. సెట్లో మాత్రం వీరిద్దరూ గొడవపడేవారని చెప్పాడు. చరణ్ నన్ను గిల్లాడు అంటూ.. తారక్ అంటే.. అదేంలేదే.. నా స్క్రిప్ట్ నేను చదువుకుంటుంన్నాను అంటూ అమాయకపు ముఖం పెట్టి చరణ్ చెప్పేవాడు అంటూ తెలిపాడు. దీని కారణంగా చాలా వరకు నా షూటింగ్ నిలిచిపోయేది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




























