Star Actress: ప్రస్తుత కాలంలో ఎంతోమంది అమ్మాయిలు వారి జీవితం పై ఏ మాత్రం శ్రద్ధ చూపకుండా సోమరిపోతుల్లాగా తయారవుతున్నారంటూ బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సోనాలి కులకర్ణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హిందీ తమిళ కన్నడ మలయాళ భాషలలో కలిపి సుమారు 70కి పైగా సినిమాలలో నటించారు.

ఇలా ఎన్నో సినిమాలలో నటించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచినటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె అమ్మాయి ల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక అబ్బాయి 18 సంవత్సరాలు నిండగానే తన ఇంటికి ఆర్థికంగా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది కానీ అమ్మాయి మాత్రం 25 సంవత్సరాలు వచ్చిన ఏమాత్రం సంపాదన లేకుండా అది కావాలి అంటూ బాయ్ ఫ్రెండ్స్ లేదా తల్లిదండ్రులను విసిగిస్తున్నారని తెలిపారు.
ఇక అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వారి విషయంలో ఇలాంటి ధోరణిలోనే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. అమ్మాయికి పెళ్లి చేయాలంటే అబ్బాయికి సొంత ఇల్లు, కారు ఉందా ఇంక్రిమెంట్స్ వస్తున్నాయా నెలకు 50 వేలు జీతం వస్తుందా లేదా అని ఆలోచిస్తున్నారు కానీ అమ్మాయి తన కాళ్లపై తాను నిలబడిందా లేదా అనే విషయాన్ని ఆలోచించడం లేదని తెలిపారు.

Star Actress: ఇంక్రిమెంట్లు వచ్చే భర్త కావాలి….
దేశంలో అమ్మాయిలందరూ సోమరిపోతుల్లా మారుతున్నారు. వారికి ఇంక్రిమెంట్లు వచ్చే భర్త కావాలి కానీ వాళ్ల సొంత కాళ్లపై వాళ్లు నిలబడటం మర్చిపోయారంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే కొందరు ఈమె వ్యాఖ్యలకు మద్దతు తెలుపగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు.
Hope Sonali Kularni contributes equally to her household and chips in half with her husband who is the current CEO OF ALTBALAJI AND A PROMINENT NAME IN ENTERTAINMENT.
She also says WOMEN CREATE UNNECESSARY DRAMA WHEN CONTACTED BY HR. TAKE A GUESS https://t.co/mZyetPjgrF— ahsni (@reveristsadboii) March 17, 2023