Star Actress: హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చి వారితో అడ్జస్ట్ అవ్వమన్నారు.. నటి షాకింగ్ కామెంట్స్!

0
133

Star Actress: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు అందుకోవాలి అంటే ఎంతో కష్టపడటమే కాకుండా ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే కొందరు ఏకంగా కమిట్మెంట్లు కూడా అడుగుతూ ఉంటారు.ఇలా చాలామంది ఈ విధమైనటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్న వారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.

ఈ క్రమంలోనే బుల్లితెర నటి జీవిత కూడా ఈ విధమైనటువంటి చేదు సంఘటనలను ఎదుర్కొన్నానని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. తమిళ బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిగా నటించిన జీవిత ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో సినిమా అవకాశాలను అందుకున్నారు అయితే ఆమెకు మొదటి సినిమా అవకాశం రావడంతో తాను ఎంతో అదృష్టవంతురాలని సంతోషపడ్డానని ఈమె తెలిపారు.

ఇలా తనకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నీకు మంచి రెమ్యూనరేషన్ మంచి పాత్రలు ఇండస్ట్రీలో ఎలాంటి డోకా లేకుండా అవకాశాలు ఇస్తామని చెప్పారు. అయితే నువ్వు మాతో అడ్జస్ట్ అవ్వాలని చెప్పినప్పుడు తనకు అర్థం కాలేదని ఈమె తెలియజేశారు. అయితే ఆ డైరెక్టర్ మాట్లాడుతూ నీకు మంచి అవకాశాలు రావాలంటే నువ్వు మా మేనేజర్ ప్రొడ్యూసర్ కెమెరామెన్ వాళ్లకు కుదిరినప్పుడు నీ గదికి వస్తారని తెలిపారు.

Star Actress:ఎంతో అవమానించబడ్డాను…

ఇలా వాళ్లు నీ గదికి వచ్చినప్పుడు నువ్వు వారిని సంతోష పెట్టాలని డైరెక్టర్ చెప్పినప్పుడు ఆయన మాటలు నాకు పూర్తిగా అర్థం అయ్యి ఒక్కసారిగా ఏడ్చానని తెలిపారు. అలా ఆరోజు నేను ఎంతో అవమానించబడ్డానని ఆ క్షణమే అక్కడి నుంచి బయటకు వచ్చేసాను.. కానీ ఆ అవమానాన్ని తాను చాలా రోజులు మర్చిపోలేదని ఈ సందర్భంగా నటి జీవిత చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.