Puri Jagannath: సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా పాన్ ఇండియా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా ఒకప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వారే. ఇలా పూరి జగన్నాథ్ ఎంతో మంది స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చారని చెప్పాలి.

ఒకప్పుడు వరుస హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న పూరి జగన్నాథ్ ఇటీవల కాలంలో తన సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోతున్నారు. త్వరలోనే డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా పూరి జగన్నాథ్ ఆలీతో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇందులో భాగంగా తనని చంపడం కోసం మరొక డైరెక్టర్ తల్లి ప్లాన్ చేశారు అంటూ ఈయన షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. అయితే ఈయనని కక్షతో చంపాలని ప్లాన్ చేయలేదు సరదాగా మాట్లాడారు అంటూ ఈయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ కు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మంచి స్నేహితుడనే విషయం మనకు తెలిసిందే.
నాతో మాట్లాడరు..
ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ మాట్లాడుతూ వర్మ గారు ఎప్పుడు విదేశాలకు వెళ్లిన వచ్చిన వెంటనే తన తల్లి దగ్గర కాసేపు కూడా మాట్లాడకుండా నేను వెంటనే జగన్ ను కలవాలి అంటూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు దీంతో తన తల్లి నాపై చాలా కోప్పడేదట. అందుకే ఒకరోజు వర్మ అమ్మగారు నాతో మాట్లాడుతూ వీడు విదేశాల నుంచి వస్తానే నాతో కాసేపైనా మాట్లాడుకున్న నీ దగ్గరకు వస్తాడు అందుకే నిన్ను చంపేస్తాను అంటూ సరదాగా మాట్లాడారని ఈ విషయాన్ని తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.



























