Star Hero: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలు వారి చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అభిమానులు వాటిని షేర్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు.కొందరు సెలబ్రిటీలు బాల నటీనటులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరో హీరోయిన్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇలా ప్రస్తుతం ఓ హీరో చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఈ కుర్రాడు నటి రాధికతో కలిసి ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇందులో ఉన్నటువంటి హీరో ఎవరో గుర్తించారా అంటూ పెద్ద ఎత్తున ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. అయితే ఈయన ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ సంచలనం సృష్టిస్తున్నారు.
ఈ ఫోటోలో ఉన్న హీరో మరెవరో కాదు విజయ్ దళపతి. బాలనటుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్ అనంతరం హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించారు. ఇక రాధికతో కలిసి ఉన్నటువంటి ఈ ఫోటో ‘ఇతు ఎంగల్ నీతి’ సినిమా స్టిల్.. 1988లో వచ్చింది.. విజయ్ తండ్రి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Star Hero: బాల నటుడుగా ఎంట్రీ ఇచ్చిన విజయ్….
ఇలా అప్పటి ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఫోటోలను అభిమానులు మరింత వైరల్ చేస్తున్నారు. ఇలా బాలనటుడిగా తన కెరియర్ ప్రారంభించిన విజయ్ దళపతి ప్రస్తుతం హీరోగా వరుస తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక తాజాగా ఈయన వారసుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్నారు.


































