టాలీవుడ్ లో మొదటి తరం అగ్రహీరోలుగా చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున స్టార్ హారోలుగా పేరుతెచ్చుకున్నారు. ప్రస్తుతం కూడా కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసి పోకుండా మంచి సినిమాలు తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే ఇటీవల ఈ స్టార్ హీరోలు యాంకర్స్ గా మారిపోయి.. అందులో కూడా తమ సత్తా చాటుకుంటున్నారు.

అటు వెండితెరలోనే కాదు.. టెలివిజన్ లో కూడా తమ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. సినిమాలకు తగ్గకుండా తీసుకుంటున్నారు. ఇప్పటికే నాగార్జున, చిరంజీవి యాంకర్స్ గా మారిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి స్టార్ మా చానల్‌కు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో హోస్టుగా మారి తన అభిమానులను అలరించారు.
నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఇప్పడు సీజన్ 5 వరకు హోస్ట్ గా చేస్తున్నారు. దీంతో అతడు హ్యాట్రిక్ కొట్టేశాడు. అయితే బాలయ్య కూడా త్వరలో ఆహాలో ప్రసారం కానున్న టాక్ షోలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇక పోతే విక్టరీ వెంకటేష్ మాత్రమే యాంకర్ గా ఇంకా తన కెరీర్ ను మొదలు పెట్టలేదు. ఇక జూనియర్ హీరోల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వెండితెరపై .. టెలివిజన్ పై రెచ్చిపోతున్నారు. ఇక వారిలో ముఖ్యంగా నాని బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇక బిగ్ బాస్ సీజన్ 1 కి హోస్ట్ గా చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు లో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దగ్గుపాటి రానా అయితే నంబర్ వన్ యారీ లో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. జగపతిబాబు హోస్టుగా మారి కో అంటే కోటి టీవీ షోతో ప్రేక్షకులను అలరించారు. ఇక సాయి కుమార్ గురించి చెప్పాల్సి అవసరం లేదు. అతడు ఈ టీవీలో ప్రసారం అవుతున్నా వావ్ కు హోస్ట్ గా వ్వవహరిస్తున్నారు.
































