Heroines Secret Marriage: తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి తారలు సావిత్రి, శ్రీదేవి వంటి హీరోయిన్లకు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీల గా కొనసాగుతున్న కొంతమంది హీరోయిన్స్ వారి వ్యక్తిగత జీవితంలో రహస్య వివాహం చేసుకుని అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. మరి రహస్య వివాహం చేసుకున్న ఆ సెలబ్రిటీలు ఎవరు ఇక్కడ తెలుసుకుందాం…

మహానటి సావిత్రి గురించి అందరికీ తెలిసిందే.ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నేపథ్యంలో ఈమె జెమినీ గణేషన్ ప్రేమలో పడ్డారు. అతనికి పెళ్లి జరిగి పిల్లలు ఉన్నారని తెలిసినప్పటికీ ఈమె అతని రహస్య వివాహం చేసుకొని అభిమానులకు ఝలక్ ఇచ్చారు.

ఇక అతిలోకసుందరి అందాల తార శ్రీదేవి కూడా మిధున్ చక్రవర్తిని రహస్య వివాహం చేసుకున్నారు.మిధున్ చక్రవర్తికి అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నారని తెలిసిన శ్రీదేవి అతనిని రహస్యంగా వివాహం చేసుకొని అభిమానుల గుండెలను ముక్కలు చేసింది. కొన్ని కారణాల వల్ల మిథున్ చక్రవర్తితో విడిపోయిన శ్రీదేవి అనంతరం బోనీ కపూర్ ను పెళ్లి చేసుకున్నారు.

కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నీలాంబరి రమ్యకృష్ణ ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలారు.ఇలా అందరికీ అభిమాన నటిగా మారిపోయిన రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణ వంశీని ప్రేమించి రహస్య వివాహం చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు.
అభిమానుల గుండెలను ముక్కలు చేసిన తారలు…
దాదాపు దశాబ్దకాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక తారగా కొనసాగిన నటి శ్రీయ రష్యన్ ఫోటోగ్రాఫర్ ప్రేమలో పడి అతనిని పెళ్లి చేసుకున్న చాలా రోజులకి తన పెళ్లి గురించి బయట పెట్టారు.కేవలం పెళ్లి విషయమై కాదండోయ్ తనకి కూతురు పుట్టిన విషయాన్ని కూడా శ్రియ దాచిపెట్టి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. వీరితోపాటు ముద్దుల మామయ్య సినిమాలో బాలకృష్ణ చెల్లెలిగా నటించిన సీత, సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోయిన్ దేవయాని, బిచ్చగాడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన సాత్నా టైటస్ కూడా రహస్యంగా వివాహం చేసుకుని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు.
































