Prakash Raj: సినీ పరిశ్రమలో ఎన్నో వందల సినిమాల్లో నటుడిగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన గత మా ఎన్నికలలో మంచు విష్ణు పై పోటీ చేసి పరాజయం పాలైన సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి సినీపరిశ్రమకు టికెట్ల వ్యవహారం గురించి ఇప్పటికీ ఏదో ఒక వివాదం చెలరేగుతోంది.

ఈ క్రమంలోనే సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ త్వరలోనే జీవో విడుదల చేస్తామని తెలిపిన ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేదు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదలయి అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఏపీలో మాత్రం టికెట్ల రేట్లు దారుణంగా ఉంది.

ఈ క్రమంలోనే ఈ పరిస్థితుల పై నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఏపీ ప్రభుత్వానికి చిన్న విన్నపం చేశారు. ఇప్పటికైనా చిత్రపరిశ్రమ పై జరుగుతున్న దాడిని ఆపండి అంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. సృజన సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణిని ఏమిటి అంటూ ఈయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
కక్ష సాధింపు బాక్సాఫీస్ వద్ద ఎందుకు…
చిత్ర పరిశ్రమను క్షోభ పెడుతూ మరో వైపు మేమే ప్రోత్సహిస్తున్నాము అంటే మేము ఎలా నమ్మాలి?. ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు? ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన ప్రేక్షకుల ఆదరణకు ఎవరు అడ్డుకట్ట వేలేరు. అంటూ ప్రకాష్ రాజు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#BheemlaNayak .. #GovtofAndhrapradesh please put an end to this onslaught..let cinema thrive ????????????????????????#JustAsking pic.twitter.com/eZxpVYYZbI
— Prakash Raj (@prakashraaj) February 27, 2022































