మన చిన్నతనంలో మన కార్టూన్ చానెల్స్ ని దెబ్బ తీసేవి రెండే రెండు. ఒకటి చదువు అయితే రెండోది మన అమ్మలు చుసిన సీరియల్స్. మనకు ఫుడ్ పెట్టకపోయినా సరే అమ్మ మాత్రం టీవీ సీరియల్ మిస్ అయ్యేది కాదు. ఇది ప్రతి ఇంట్లో ప్రతి చిన్నారికి జరిగిన అనుభవమే అంటే కాదు అని ఎంత మంది అనగలరు. సీరియల్ ముందు వచ్చే మ్యూజిక్ సౌండ్ స్టార్ట్ అయ్యిందంటే చాలు ఇంట్లో సామాన్లు డభి డిబి అంటూ ఎక్కడివి అక్కడికి చేరిపోయి అమ్మ టీవీ ముందుకు వెళ్లి కూర్చునేది.

ఇప్పటికి ఆ సీరియల్ టైటిల్ సాంగ్స్ మన మైండ్ లో రన్ అవుతూనే ఉంటాయి. 90 లలో పుట్టిన పిల్లలందరికీ ఈ సీరియల్స్ మ్యూజిక్ వినిపిస్తే చాలు లేచి కూర్చుంటారు. అంతగా మైండ్లోకి ఎక్కించేసారు మన ఇంటి అమ్మలు బామ్మలు. ఈటీవీ లో అయితే నీ ఉష కిరణాలు తిమిరా సంహరణాలు అని వస్తే చాలు ఇంకా మిగతా సాంగ్ మీరు లోపల లోపల వేసుకుంటున్నారు కదా.. మరి అంత ప్రభావం ఉండిపోయింది. మరి మనల్ని అమాంతం మింగేసిన ఆ సీరియల్స్ ఏంటో ఆ కథ కమీషులు ఏంటో ఒకసారి చూద్దాం.

అంతరంగాలు

మొదటగా అంతరంగాలు..నేను ఈ టైటిల్ చెప్పగానే మీలో చాలా ఏమండీ టైటిల్ సాంగ్ అంతరంగాలు, అనంత మానస చదరంగాలు ఏసుకుంటున్నారు కదా… అంతే అండి మరి ఇంత ఇంపాక్ట్ ఇచ్చిన సీరియల్ ఇది. ఈ సీరియల్ టైటిల్ సాంగ్ వచ్చినప్పుడు రీల్ ని స్పైరల్ వెనక్కి తిప్పుతూ మొదలు పెట్టేవారు.

అందం

ఈటీవీలో అప్పట్లో వచ్చిన మరో ఆణిముత్యం ఇది. అంతరంగాలు సీరియల్ ఫేమ్ తోనే ఈ సీరియల్ కూడా వచ్చింది. అందం అందం జీవం సుమగండం అంటు కార్టూన్స్ తో వచ్చే ఈ పాట తో ఎంతో మందిని తమ వైపు తిప్పుకున్నారు. ఈ సీరియల్ లో నల్లపిల్లి ని పట్టుకుని నల్లటి నైల్ పాలిష్ వేసుకొని వచ్చే ఒక పాత్ర ఎంతో మందికి గుర్తుండే ఉంటుంది.

మెట్టెల సవ్వడి

మేడలో మాంగల్యం మదిలో అలజడులు అంటు తమిళ్ సన్ ఛానెల్ నుండి డబ్ అయిన ఆణిముత్యాలలో ఇది ఒకటి. మిట్టమధ్యాహ్నం ఒంటి గంటకి వచ్చే ఈ సీరియల్ సమ్మర్ హాలిడేస్ లో చూసింది ఇంకా చాల మందికి గుర్తుంది.

పిన్ని

పిన్ని అంటు ఒక చిన్న పిల్ల వాయిస్ ముందు వచ్చి పాట స్టార్ట్ అవుతుంది. టెంపుల్ లోనే ఈ పాట మొత్తం తిరుగుతూ ఉంటుంది. రాధికా లీడ్ రోల్ లో చేసిన ఈ సీరియల్ అప్పటికి ఇప్పటికి ఎంతో పాపులర్. ఈ సీరియల్ కి పార్ట్ 2 కూడా వస్తుంది అంట..

మర్మదేశం

గుర్రం మీద ఒక వ్యక్తి ముసుగు వేసుకొని మొహం కనబడనీయకుండా కనిపిస్తూ నిజంగా బయపెట్టేవాడు. వీరభద్రుడు అనే పాత్ర తో సీరియల్ మొత్తం ఒక కురియాసిటీ ని క్రియేట్ చేసి అద్భుతంగా రక్తి కట్టించారు. అప్పట్లో ఈ సీరియల్ వస్తుంది అంటే చాల మంది చిన్న పిల్లలకు సుస్సు వచ్చేది. అయిన కూడా అప్పట్లో ఇది చాల పాపులర్ సీరియల్.

కాష్మోరా

అప్పట్లి ఇది మనలో చాల మందికి వెన్నులో వణుకు పుట్టించిన సీరియల్. ఇది చూసి మా అమ్మమ్మ అందుకే వెంట్రుకలు గోర్లు ఎక్కడ పడితే అక్కడ పడెయ్యాడు. ఇప్పటికి మనలో చాల మంది వెంట్రుకలు బయటపడెయ్యకుండా చేసింది ఈ సీరియల్.

విధి

ఇది కూడా ఈటీవీ మీ టీవీ సీరియల్. ఓ విధి విచిత్రాల నిధి అంటు సాగే ఈ సీరియల్ అప్పట్లో వచ్చిన మంచి సీరియల్స్ లో ఒకటిగా పరిగణించ వచ్చు.

ఎండమావులు

ఎండమావులు నీ గుండెలోని ఆశలు. అంటు ఒక బాధాకరమైన పాట తో ఆల్మోస్ట్ సమె కార్టూన్స్ తో మొదలయ్యేయేది..ఇది చూసి అమ్మలంత కన్నీళ్లు కార్చేవారు.

అన్వేషిత

ఓ అన్వేషిత ..అన్వేషిత అన్వేషిత.. ఒక గొరిల్లా మాష్ వ్యక్తి , కొన్ని గబ్బిలాలు, తెల్ల చీరలో యమునా..చాలు ఇంతకన్నా వణుకు పుట్టించేది ఏమి ఉండేది కాదు అప్పట్లో. ఎంత భయమేసి చూడాల్సిందే అనేవాళ్ళం.

అమృతం

ఒరేయ్ ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు అంటు ఈ సాంగ్ వినపడగానే ఇంట్లో ఉన్న వారు ఎవరు పని చేస్తున్న అంత కలిసి కూర్చొని చుసిన సీరియల్ అమృతం. క్లీన్ అండ్ ప్యూర్ కామెడీ కంటెంట్ తో ఆల్మోస్ట్ 300 ఎపిసోడ్స్ వచ్చిన ఈ ఎవర్ గ్రీన్ సీరియల్ ని ఇప్పటికి యూట్యూబ్ లో చూసే వాళ్ళు ఉన్నారు. దీనికి సైతం 2nd పార్టీ వస్తుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ అవుతుంది. మిగిలినవి మీకు నచ్చినవి ఈ లిస్ట్ లో లేనివి ఉంటె కామెంట్స్ లో మాకు తెలియచేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here