అప్పట్లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రాజసులోచన, సి. ఎస్. రావు ల వివాహం అప్పట్లో పెద్ద సెన్సేషన్. రాజసులోచన అప్పట్లో వ్యాంప్ గా నటించేది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా హీరోయిన్ గా వెలుగొందింది. ఆ సమయంలోనే రాజసులోచన అప్పట్లో ఓ వ్యక్తి వెంటపడి పెద్దలను ఎదిరించి ఆయనతో వివాహం చేసుకుంది. అలా ఆయనతో వివాహం చేసుకున్న తర్వాత ఓ పిల్లవాడికి జన్మను కూడా ఇచ్చింది. వివాహం జరిగిన తర్వాత ఆవిడకు సినిమా ఛాన్సులు తగ్గిపోవడంతో వారిద్దరు విడిపోయారు. అలా ఆవిడ మళ్ళీ ఒంటరిగా మారిపోయింది. అదే సమయంలో ప్రముఖ దర్శకుడు సి.పుల్లయ్య కొడుకు సి.ఎస్.రావు తో పరిచయం ఏర్పడింది.

ఆయన వివాహితుడు అని తెలిసినా కూడా ఆయన వెంటపడి మరి ప్రేమించింది. ఆవిడ ప్రముఖ నటి కన్నాంబ గారి అల్లుడు. ఎంత మంది పెద్దలు చెప్పినా కానీ వారి మాటలను లెక్కచేయకుండా సెన్సేషనల్ డైరెక్టర్ సి.ఎస్.రావు వెంటబడి మరీ ప్రేమించింది రాజసులోచన. ఆ తర్వాత రాజసులోచన ప్రేమలో సి.ఎస్.రావు కూడా మునిగి తేలాడు. అయితే ఆ తర్వాత రాజసులోచన దశ తిరిగిపోయింది. ఆ తర్వాత దర్శకుడు సి.ఎస్.రావు చేసే ప్రతి సినిమాలో దాదాపు ఆవిడే హీరోయిన్ గా కొనసాగుతూ అనేక సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలా ఆ సమయంలో సౌతిండియా టాప్ హీరోయిన్ గా ఆవిడ పేరు పొందింది.
అయితే ఆ సమయంలో రాజసులోచన కేవలం సినిమా ఆఫర్స్ కోసమే సి.ఎస్.రావు ను పెళ్లి చేసుకున్నట్లు తెలిపేవారు. అయితే అప్పట్లో మరో పెద్ద హీరోయిన్ అయిన కన్నాంబ తన కూతురి జీవితం నాశనం అవుతుందని గ్రహించి ఆ సమయంలో రాజసులోచనను ఆవిడ ఇంటికి పిలిపించుకుంది. కన్నాంబ లాంటి స్టార్ హీరోయిన్ ఆవిడను ఇంటికి పిలిపించుకొని మందలిస్తారు అని అనుకున్న రాజసులోచన ఆవిడ భయపడుతూనే వెళ్ళింది.
తన కూతురు మీద అల్లుడికి ప్రేమ లేదని అయితే నా కూతురు జీవితం నాశనం అయినట్లుగా మీ జీవితం నాశనం చేసుకోవద్దని మీరైనా సరిగ్గా బతకమని చెప్పి పంపించింది. అలా మొదటి భార్య తల్లి పర్మిషన్ తో 1963లో గురువాయూర్ లో సి.ఎస్.రావు రాజసులోచన ను పెళ్లి చేసుకున్నారు. వీరికి కవలలు. రాజసులోచన కు సి.ఎస్.రావు తో పెళ్లి కాకముందు మొదటి భర్త తో ఒక కొడుకు ఉండగా సి.ఎస్.రావు తో మరో అబ్బాయి, అమ్మాయికి జన్మను ఇచ్చింది. వీరందరూ ఒకే ఇంట్లో జీవించేవారు. అయితే పిల్లలు పెరుగుతున్న సమయంలో సిఎస్ రావు గారికి అవకాశాలు బాగా తగ్గిపోయాయి.
ఆయన చేసిన పనికి మొదటి భార్య కుటుంబం వారు కూడా ఆయనను దగ్గరికి రానివ్వలేదు. దీంతో కేవలం రాజసులోచన సి.ఎస్.రావు మాత్రమే అన్నట్లుగా జీవితాన్ని గడపాల్సి వచ్చింది కొన్ని రోజులు. అలా జీవితాన్ని కొనసాగిస్తూ నేపథ్యంలో పెళ్లికి ముందు చిన్న చిన్న తప్పులు గా కనపడిన ఆయన అలవాట్లు పెళ్లి తర్వాత పిల్లలు పుట్టాక రాజసులోచన పెద్దపెద్ద తప్పులుగా కనబడ్డాయి. దీంతో ప్రతి రోజు వారి ఇద్దరి మధ్య పెద్ద పెద్ద గొడవలు జరిగేవి.
ఒకవైపు సి.ఎస్.రావు ఆర్థికంగా ఎంతో దెబ్బతిన్నారు. దీంతో ఎంతో మంది పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న సి.ఎస్.రావు ను నిర్ధక్ష్యంగా రాజసులోచన ఇంటి నుంచి ఆయనను బయటికి పంపించింది. దాంతో సిఎస్ రావు గారు కట్టుకున్న వారు లేక ఆయన వారు లేక అతి దయనీయమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు 2004లో ఆయన మరణించారు. అప్పట్లో టాప్ డైరెక్టర్ గా కొనసాగిన ఆయన రోడ్లపై తిరుగుతుండడంతో అతన్ని గుర్తు పట్టిన ప్రజలు ఆశ్చర్య పోయారు.
































