ఆమెను చీరలో చూడాలి మోడీ గారు.. దయచేసి ఫెర్వెల్ చేసుకోనివ్వండి..!

0
32

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి ఉధృతమవుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే కరోనాను కట్టడి చేయడం కోసం ఎంతో కఠినమైన ఆంక్షలను విధిస్తున్నారు. అదేవిధంగా దేశంలోని పలు రాష్ట్రాలలో విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు లేకుండా వారిని పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. తాజాగా సీబీఎస్‌ఈ బోర్డు పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరీక్షలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్షలను నిర్వహించి ఎంతోమంది విద్యార్థులను ఈ మహమ్మారి బారిన పడటం కన్నా పరీక్షలు రద్దు చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని, విద్యార్థులు రిస్క్ లో పడటానికి పరీక్షలు కారణం కాకూడదన్న ఉద్దేశంతోనే పరీక్షలను వాయిదా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఈ విధంగా పరీక్షలు రద్దు కావడంతో విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉన్నారు.ఈ విధంగా పరీక్షలు రద్దు చేసే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏకీభవించని ఓ విద్యార్థికి ఒక వింత కోరిక కలిగింది.12వ తరగతి ముగించుకుని స్కూల్ నుంచి బయటకు వెళ్లే తమకు కనీసం ఫేర్ వెల్ పార్టీ జరుపుకోలేకపోయామనే బాధతో ఆ విద్యార్థి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే ట్వీట్ చేశాడు.

విద్యార్థి ప్రధానమంత్రికి ట్వీట్ చేస్తూ…”సార్ ఫేర్‌వెల్‌ పార్టీ అయినా చేసుకోనివ్వండి.12 వ తరగతి బి సెక్షన్ నేహను నేను చీరలో చూడాలనుకుంటున్నాను”అంటూ ప్రధానమంత్రికే ట్వీట్ చేశాడు. ఈ విధంగా విద్యార్థి తన గర్ల్ ఫ్రెండ్ ను చీరలో చూడటం కోసం ఏకంగా ప్రధానమంత్రికి ట్వీట్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ విధంగా విద్యార్థి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ ట్వీట్ చేసిన నెటిజన్లు తమకు తోచిన విధంగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here