Subbaraju: గత కొంతకాలంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. త్వరలోనే నాగచైతన్య శోభిత వివాహం అలాగే కీర్తి సురేష్ వివాహం కూడా జరగబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి.

ఈ క్రమంలోనే మరో టాలీవుడ్ కమెడియన్ కూడా పెళ్లి పీటలు ఎక్కారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుబ్బరాజు ఇటీవల పెళ్లి చేసుకున్నారు అయితే ఈయన చాలా లేట్ వయసులో పెళ్లి పీటలు ఎక్కారని చెప్పాలి. తాజాగా పెళ్లి దుస్తులలో తన భార్యతో బీచ్ పక్కన నిల్చొని ఉన్నటువంటి ఫోటోలు ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ విధంగా సుబ్బరాజు పెళ్లి చేసుకున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. ప్రస్తుతం ఈయన పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Subbaraju: అసిస్టెంట్..
ఇక సుబ్బరాజు ఖడ్గం సినిమా సమయంలో కృష్ణవంశీ వద్దకు ఒక కంప్యూటర్ ను రిపేర్ చేయడం కోసం వచ్చారు అయితే ఆ సమయంలోనే ఈయన కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ గా చేరి అనంతరం సినిమాలలో అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈయన వరుస తెలుగు సినిమాలలో విలన్ పాత్రలలోను కమెడియన్ గా అవకాశాలు అందుకుంటూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో కూడా సుబ్బరాజు నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు.
https://www.instagram.com/p/DC11QmisIK2/?utm_source=ig_web_copy_link






























