Subbaraya Sharma : నాటకరంగం నుండి సినిమాల్లోకి ఎందరో నటులు వచ్చారు. అలా నాటక రంగం నుండి సినిమాల్లో నటిస్తూ అలానే రేడియోలోనూ నాటికల ద్వారా పరిచయమై అలాగే బుల్లితెర మీద కూడా నటిస్తున్న వ్యక్తి ఉప్పలురి సుబ్బరాయశర్మ. నాలుగు రంగాల్లోను పనిచేస్తూ అలాగే ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆయన 200 పైగా సినిమాల్లో నటించారు. ఇక సినిమాల్లోనే కాకవుందా చిన్నతనం నుండే నాటకాలలో నటించిన ఆయన ఎల్ బి శ్రీరామ్ గారి ఒంటెద్ధు బండి నాటకాన్ని వందసార్లు ప్రదర్శించి మెప్పించారు. ఇక నాటకాలకు ఆయనకు ఎన్నో అవార్డులు ఇక సీరియల్స్ లో నటనకు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.

అమ్మను అనాధాశ్రమంలో చేర్పించా….
సుబ్బరాయ శర్మ గారు సినిమాల్లో నటిస్తూనే చాలా రోజులు ఉద్యోగంలో కంటిన్యూ అయ్యారు. ఆయన తన వ్యక్తిగత విషయాలను చెబుతూ తన తల్లికి క్యాన్సర్ ఉందని తెలిసినపుడు ఒకవైపు హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్యం చేయింస్తూనే మరో వైపు షూటింగ్స్ కి వెళ్లే వాడినంటూ చెప్పారు. అదే సమయంలో భార్య అమెరికా లో ఉండటం వల్ల తల్లిని చూసుకుంటూ షూటింగ్స్ కి వెళ్లడం ఇబ్బందిగా ఉండటంతో అమ్మను అనాదాశ్రమం లో చేర్పించాను.

హాస్పిటల్ లో వైద్యం చేయిస్తూ తనని అక్కడ ఉంచాల్సి వచ్చిందంటూ తెలిపారు. షూటింగ్స్ కి వెళ్లి అక్కడ వచ్చే డబ్బు తో వైద్యం కు ఖర్చులు సరిపోయేవని ఒక్కోసారి ముందుగానే అడ్వాన్స్ ఇప్పించుకోవాల్సి వచ్చేదంటూచెప్పారు. అలా వంశీ గారు ముందే నా ఇబ్బందిలను గమనించి అడ్వాన్స్ ఇచ్చారని సుబ్బరాయ శర్మ తెలిపారు.




























