Suchendra Prasad : పవిత్ర లోకేష్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమాల్లో కంటే ఇప్పుడు వ్యక్తిగత విషయాలతో మరింత వైరల్ అవుతోంది. పవిత్ర లోకేష్, నరేష్ మధ్య స్నేహం ఉందో, ఇంకేమైనా బంధముందో అది వారికే తెలియాలి. ఇక వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ విషయంలో మాత్రం నరేష్ మూడో భార్య రమ్య పవిత్ర లోకేష్ మీద చాలా ఆరోపణలు చేసింది. ఇక ఏకంగా వీరిద్దరిని మైసూర్ లోని ఒక హోటల్ గదిలో ఉండగా పట్టించి రచ్చ చేసింది రమ్య. అయితే ఈ విషయాలపై పవిత్ర లోకేష్ భర్త సుచేంద్ర ఆసక్తికరంగా మాట్లాడారు.

నా భార్య ఏ తప్పు చేయలేదు… నాకు అన్ని వివరించింది…
ఇక హోటల్ గదిలో పవిత్ర లోకేష్, నరేష్ ఇద్దరూ ఉండటం ఈ వీడియో బయటకు వచ్చి వైరల్ అవ్వడం తెలిసిందే. అయితే దీనిపై పవిత్ర లోకేష్ భర్త సుచేంద్ర ప్రసాద్ స్పందించారు. పవిత్ర నేను విడాకులు తీసుకోలేదని ఇప్పటికీ కలిసున్నాం అన్నట్లుగా ఆయన చెప్పారు. ఇక హోటల్ గదిలో ఇద్దరూ ఉండటం దురదృష్టకరమైన సంఘటన అంటూ స్పందించారు. అయితే ఆ తరువాత పవిత్ర నాకు ఫోన్ చేసి ఏం జరిగిందో వివరించిందని చెప్పారు. ఇక రమ్య రఘుపతితో ఉన్న పవర్ టీవీ అధినేత రాకేష్ శెట్టి ఎవరో తనకు తెలియదని చెప్పారు. సుచేంద్ర ప్రసాద్, పవిత్ర లోకేష్ లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఇక పిల్లలను ఈ వివాదాల్లోకి లాగవద్దంటూ మీడియా వాళ్లకు చెప్పారు. పిల్లలకు అసలు విషయాలేవి తెలియదని, అయినా కుటుంబ వ్యక్తిగత విషయాలను ఎందుకు అడుగుతున్నారు అంటూ చెప్పారు. ఇక పవిత్ర కు సుచేంద్రకు విడాకులు జరగలేదని ఆయన చెప్తున్నారు కానీ పవిత్ర మాత్రం దీనికి విరుద్ధంగా అసలు సుచేంద్ర ప్రసాద్ తో వివాహం జరగలేదని అంటున్నారు. ఇక ఈ విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా సుచేంద్ర గారు తన భార్య పవిత్ర లోకేష్ మాత్రం ఏ తప్పు చేయలేదని చెప్తున్నారు.































