Sudhakar Komakula : 2012లో విడుదల అయిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుధాకర్ కోమాకుల. అయితే అంతకంటే కొన్ని సినిమాల్లో నటించిన సుధాకర్ స్వస్థలం వైజాగ్ కాగా డాన్స్గ్రూప్ లో మెంబెర్ గా ఉంటూ సినిమాల వైపు వచ్చాడు. ‘మనసు’ అనే సినిమాతో పరిచయమైనా ‘ఒక వి చిత్రమ్’ సినిమాలోనూ నటించాడు. అయితే ఆ సినిమాల్లో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తరువాత కుడా కుందనపు బొమ్మ, హ్యాంగ్ అప్, నువ్వు తోపురా, ఉందిలే మంచి కాలం ముందు ముందున వంటి సినిమాలను చేసినా అవి నిరాశ పరిచాయి. అయితే కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారినవి కూడా తన కెరీర్ లో ఉండగా అలాంటి ఆసక్తికరమైన విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఆ సినిమాల్లో మొదట హీరో నేనే…
సుధాకర్ మంచి టాలెంటెడ్ నటుడే అయినా సరిగా ప్లాన్ చేసుకొకపోవడం అలానే మంచి అవకాశాలు రాకపోవడం వల్ల ఇంకా హీరోగా ఎదగాలేదు. ఇటీవల ‘క్రాక్’ వంటి సినిమాల్లో నటించి మళ్ళీ ప్రేక్షకులకు కనిపించిన సుధాకర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా సక్సెస్ ను ఉపయోగించుకోలేకపోయానని ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సినిమా తరువాత అవకాశాలు వచ్చినా మరీ జాగ్రతగా అలోచించి వద్దనుకున్నవి ఉన్నాయని అలా గ్యాప్ వచ్చేసిందని తెలిపారు.

ఇక ‘ఊహలు గుస గుసలాడే’ సినిమాలో మొదట తనని హీరోగా అనుకున్నా మళ్ళీ నాగ్ శౌర్య ని తీసుకున్నారు అంటూ చెప్పారు. అలానే నీది నాది ఒకే కథ సినిమాలో కూడా నేనే మొదట హీరోగా అనుకున్నా అడ్వాన్స్ కూడా తీసుకున్నాక నన్ను కాదని శ్రీ విష్ణు ని హీరోగా తీసుకున్నారు. చాలా సినిమాలలో నేను లేకపోడానికి కారణం ప్రొడక్షన్ వైపు నుండి లెక్కలు మారిపోవడమే. సినిమా ఏ ఒక్కడి వల్లో ఆడదు. అన్ని లెక్కలు వేసుకోవాలి అలాంటపుడు మార్కెట్ గురించి ఆలోచిస్తారు. ఇండస్ట్రీలో నాకంటూ ఎవరూ లేకపోవడం కూడా ఒక కారణం అంటూ తెలిపారు.































