తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ గా సుధాకర్ అందరికీ తెలుసు. కానీ అతడు తమిళంలో సూపర్ స్టార్ లెవల్లో ఎదిగాడు. దాదాపు వరుసగా 40 సినిమాలు తీసి స్టార్ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు హీరోగా నటించిన 40 సినిమాల్లో దాదాపు 30 సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. తర్వాత తమిళనాట తిరుగలేని శక్తిగా ఎదిగాడు.

రజినీకాంత్, కమల్ హాసన్ కంటే ముందే సుధాకర్ సూపర్ స్టార్ అయ్యాడు. కానీ అక్కడ ఉన్న కొంతమంది సినీ పెద్దలు అతడి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారు. కుట్రలు కుతంత్రాలు చేసి అతడికి ఆఫర్లు రాకుండా చేశారు. అప్పటి నుంచి అతడి కెరీర్ డౌన్ ఫాల్ అవ్వడం మొదలైంది. అక్కడ నుంచి అతడు తెలుగు పరిశ్రమకు వచ్చేశాడు. అలా అతడు హీరోగా కెరీర్ మొదలు పెట్టి మంచి స్టార్ అవుతున్న సమయంలో విలన్‌గా మారి చివరికి కమెడియన్‌గా ఎందరో ముఖాల్లో చిరునవ్వులు పూయించాడు. సుధాకర్ మొత్తం 600 కు పైగా సినిమాల్లో నటించాడు.
ఇలా ఇతడు వర్గాల ప్రజలను ఆకట్టుకున్న ఈ నటుడు మొదటి నుండి ఇబ్బందులు పడ్డాడు. పెద్ద పెద్ద హీరోలందరితో అయన నటించాడు.. ఏదైనా సినిమాలో సుధాకర్ లేడు అంటే అయ్యో ఇందులో సుధాకర్ లేడు అందుకే కామెడీ కూడా లేదు అని అనేవాళ్ళు.అంతలా తెలుగులో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా వరుసగా ఐదు ఆరు సినిమాల్లో కామెడియన్ గా నటించిన సుధాకర్ కు 2000 సంవత్సరం నుంచి ఆఫర్ల రావడం తగ్గాయి.
అయన చివర నటించిన సినిమా సంక్రాంతి . తర్వాత అతడు మళ్లీ 12 ఏళ్లకు రీ ఎట్రీ ఇచ్చిన ఫలితం లేకుండా పోయింది. ఇలా అతడు తన కెరీర్ నాశనం కావడానికి కారణం తమిళ ఇండస్ట్రీ అని ఎన్నో సార్లు చెప్పాడు సుధాకర్. కేవలం ఒక తెలుగు వాడు.. తమిళనాడులో ఫేమస్ కావడం ఏంటనే ఫీలింగ్ లో ఉండి చాలామంది అతడిని తొక్కేశారు అనేది వాస్తవం.



























