‘బాబా భాస్కర్’కు వార్నింగ్ ఇచ్చిన సుధీర్ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

0
171

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోలకు ఏ విధంగా అభిమానులు ఉంటారో బుల్లితెర స్టార్స్ కు కూడా అదే విధంగా అభిమానులు ఉంటారు. ఆ అభిమానులు తమకు ఇష్టమైన వారిపై ఎవరైనా కామెంట్లు చేస్తే అస్సలు తట్టుకోలేరు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే బుల్లితెరపై టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో సుడిగాలి సుధీర్ ఒకరు. జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేసినా, పలు షోలకు యాంకర్ గా చేసినా తన ఆటిట్యూడ్ తో సుధీర్ అభిమానులను పెంచుకుంటున్నారు.

సుధీర్ ఫ్యాన్స్ కు ఆయనంటే విపరీతమైన గౌరవం, అభిమానం. ఎవరైనా సుధీర్ ను పల్లెత్తు మాట అన్నా అతని ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేరు. ఇటు బుల్లితెరపై పేరు, గుర్తింపు తెచ్చుకుంటూనే సినిమాల్లో కూడా నటిస్తూ సుధీర్ కెరీర్ లో ఎదుగుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సుధీర్ పై కామెంట్లు చేస్తూ ఆ కామెంట్లనే కామెడీ పేరుతో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢీ షోలో బాబా భాస్కర్ సుధీర్ పై వేస్తున్న పంచులు ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

సుధీర్ పై ఇష్టానుసారం పంచులు వేస్తే ఊరుకోబోమని గతంలోనే సుధీర్ ఫ్యాన్స్ పలువురు సెలబ్రిటీలపై సీరియస్ అయ్యారు. కెరీర్ లో ఎన్నో కష్టాలను అనుభవించి సుధీర్ ఈ స్థాయికి చేరుకున్నారు. సోషల్ మీడియాలో సుధీర్ ఫ్యాన్స్ పేరిట ప్రత్యేక గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో సుధీర్ ను వేస్ట్ అని చేస్తున్న కామెంట్లపై సీరియస్ అవుతున్నారు. బాబా భాస్కర్ లాంటి మాస్టర్ సుధీర్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అవతలి వ్యక్తులపై పంచులు వేసే సమయంలో వాళ్ల మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాలని బాబా భాస్కర్ ను అతని ఫ్యాన్స్ సున్నితంగా హెచ్చరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఈ విధంగా ఎప్పుడూ కామెంట్లు చేయలేదని శేఖర్ మాస్టర్ ను చూసి బాబా మాస్టర్ నేర్చుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. సుధీర్ కు బాబా భాస్కర్ సారీ చెప్పాలని అతని ఫ్యాన్స్ కోరుతుండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here