Sudigali Sudheer: మిలియన్ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న సుధీర్ ఇంస్టాగ్రామ్ లో ఒక్కరినే ఫాలో అవుతున్నారని తెలుసా?

0
21

Sudigali Sudheer: బుల్లి తెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి ఈయన బుల్లితెరపై వివిధ కార్యక్రమాల ద్వారా సందడి చేశారు. అయితే సుడిగాలి సుదీర్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈయనకు సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.

ఇలా బుల్లితెరకు దూరంగా ఉన్నటువంటి సుధీర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా బుల్లితెరపై వెండితెరపై ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి ఈయన సోషల్ మీడియాలో కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. సుడిగాలి సుదీర్ కు ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఇలా ఇంస్టాగ్రామ్ లో ఇంత మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన ఇన్స్టాగ్రామ్ ద్వారా కేవలం ఒక్కరినే ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.మరి ఇంస్టాగ్రామ్ లో సుధీర్ ఫాలో అవుతున్న ఆ ఏకైక వ్యక్తి ఎవరో మీరు ఊహించగలరా అయితే ఆమె రష్మీ మాత్రం కాదండోయ్.. మరి సుధీర్ ఫాలో అవుతున్న ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే…

Sudigali Sudheer: చిరంజీవిని ఫాలో అవుతున్న సుధీర్…


సుడిగాలి సుదీర్ ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న వ్యక్తి మరెవరో కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు.చిరంజీవికి సుధీర్ వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సుదీర్ ఇండస్ట్రీలో రావడానికి చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ కావడంతో ఈయన ఇన్స్టాగ్రామ్ లో కేవలం చిరంజీవిని మాత్రమే ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.