గత నాలుగు సీజన్ల నుంచి ప్రేక్షకులను మెప్పిస్తున్న బిగ్‌బాస్ షో గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. భాష ఏదైనా కూడా ఈ షో మొదలైతే చాలు అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. తెలుగులో ఈ బిగ్‌బాస్ షో ఇప్పటికే నాలుగు సీజన్లను విజవంతంగా కంప్లీట్ చేసుకుంది. అయితే ఇది మొదటి నుంచి కూడా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది.

ఈ రియాల్టీ షోలో పాల్గొని బయటకు వచ్చిన ప్రతీ కంటెస్టెంట్ కు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇప్పుడు ఐదో సీజన్లోకి అడుగుపెట్టింది బిగ్‌బాస్ షో. కరోనా మహమ్మారి కారణంగా సమ్మర్ లో మొదలు పెట్టాల్సింది కానీ.. వాయిదా పడుతూ వచ్చింది. త్వరలో ప్రేక్షకులను అలరించనుందని టాక్ వినిపిస్తుంది. అయితే వీటిలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎంపిక కొనసాగుతోందని సమాచారం.
ఇప్పటికే పలువురి పేర్లు ఖరారు అయినట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అధికారికంగా మాత్రం ఇంత వరకు బయటకు రాలేదు. అయితే తాజాగా బిగ్ బాస్5 కంటెస్టెంట్ లో జబర్దస్త్ స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ కూడా ఎంపిక అయినట్లు టాక్ వినిపిస్తుంది.
సుధీర్ ను ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదిచారని.. అతడికి భారీగా రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. బుల్లితెరపైనే దండిగా సంపాదిస్తున్న సుధీర్ కు వారానికి రూ.14 లక్షలు ఆఫర్ చేసినట్లు.. దానికి సుధీర్ ఓకె చెప్పినట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

































