సుడిగాలి సుధీర్ కు కరోనా అంటూ జోరుగా ప్రచారం.. నిజమేనా..?

0
183

బుల్లితెర స్టార్ కమెడియన్, జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్ కరోనా బారిన పడినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్, ఢీ ఛాంపియన్స్ తో పాటు పలు ఈవెంట్లతో బిజీగా ఉన్న సుడిగాలి సుధీర్ కు కరోనా అంటూ వైరల్ అవుతున్న వార్తలు ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. రెండు రోజుల క్రితం సుధీర్ అనారోగ్యం బారిన పడ్డాడని.. పరీక్షలు చేయించగా వైరస్ నిర్ధారణ అయిందని వార్తలు వస్తున్నాయి.

సుధీర్ కానీ ఆయన టీమ్ కానీ ఈ వార్తలపై ఇప్పటివరకూ ఇంకా స్పందించలేదు. అయితే సుధీర్ కు కరోనా నిజంగా సోకిందో లేదో అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం సుధీర్ హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స చేయించుకుంటున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై అత్యంత బిజీగా ఉండే యాంకర్లలో కమెడియన్లలో సుధీర్ ఒకరు. టీవీ షోల ద్వరా సుధీర్ రోజురోజు తన రేంజ్ ను పెంచుకుంటున్నారు.

రెండు మూడు రోజుల నుండి సుధీర్ కు కరోనా సోకిందంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ మధ్య కాలంలో సుధీర్ పలు ఈవెంట్లలో పాల్గొన్నారు. సుధీర్ కు కరోనా సోకితే ఆయనతో కలిసి పని చేసిన నటులు, యాంకర్లు, సిబ్బంది హోం క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుంది. సుధీర్ కు కరోనా అంటే ఆమెతో షోలలో, ఈవెంట్లలో ఎక్కువగా పాల్గొనే రష్మీకు కూడా టెన్షన్ తప్పదు.

మరోవైపు సుధీర్ ను కాంటాక్ట్ కావడానికి ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రావడం లేదని సమాచారం. ఇప్పటికే సినిమా, టీవీ ఇండస్ట్రీలో చాలామందికి కరోనా నిర్ధారణ అయింది. డ్యాన్స్ మాస్టర్ శేఖర్ ఈ మధ్యే కరోనా నుంచి కోలుకుని షోలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here