బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో కమెడియన్ నుంచి టీమ్ లీడర్ స్థాయికి ఎదిగి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ అండ్ టీం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గెటప్ శీను ఆటో రాంప్రసాద్ సుడిగాలి సుధీర్ ఈ ముగ్గురు కలిసి ఎన్నో అద్భుతమైన స్కిట్ లో పాల్గొనేవారు.

అయితే గత కొద్దిరోజుల నుంచి వీరి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరికి సినిమా అవకాశాలు రావడంతో బుల్లితెరపై సినిమాలలో చేయడానికి ఎంతో ఇబ్బంది కరంగా ఉందని అందుకోసమే వీరు జబర్దస్త్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటూ ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే శుక్రవారం ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇందులో కమెడియన్స్ అందరూ స్కిట్ లో పాల్గొని ఈ ముగ్గురు జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.ముందుగా గెటప్ శీను వేదికపైకి వచ్చి సినిమాలలో అవకాశాలు రావడంతో ఈ కార్యక్రమం నుంచి వైదొలుగుతానని ఇంతవరకు ఈ కార్యక్రమం ద్వారా మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇక ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించాలని భావించాము అయితే ఇలా వేదికగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ ఒకరినొకరు కౌగలించుకుని కన్నీటి పర్యంతమయ్యారు.జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వీరికి సినిమా అవకాశాలు రావడం వల్ల జబర్దస్త్ ను వీడిపోతున్నట్లు వెల్లడించారు.






























