Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక బుల్లితెర కార్యక్రమాలలో కొనసాగుతున్న సమయంలో సుధీర్ యాంకర్ రష్మీ మధ్య ప్రేమ కహాని నడుస్తుంది అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి

అయితే ఇలా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతోనే వీరిద్దరి మధ్య ఇలాంటి ఎఫైర్ సృష్టించారు కానీ ఇద్దరు మంచి స్నేహితులు అంటూ పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. కానీ కొన్నిసార్లు రష్మీ సుధీర్ వ్యవహరించే తీరు చూస్తే నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అన్న సందేహం కూడా కలగక మానదు.ఇక సుధీర్ బుల్లితెరకు దూరం కావడంతో వీరిద్దరి గురించి వచ్చే వార్తలు కూడా కాస్త తగ్గగానే చెప్పాలి.
ఇక సుధీర్ ఏ కార్యక్రమంలోకి వెళ్లిన తప్పకుండా తన పెళ్లి గురించి ప్రస్తావన వస్తుంది. అయితే గతంలో సుధీర్ తన మరదలని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఓ వార్త వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఆ అమ్మాయితో కలిసి రహస్యంగా సుదీర్ నిశ్చితార్థం జరుపుకున్నారనీ మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే సుదీర్ తన మరదలితో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని తెలుస్తోంది.

Sudigali Sudheer: రష్మీ పరిస్థితి ఏంటి భయ్యా..
ఈ విధంగా సుధీర్ పెళ్లి గురించి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది సుధీర్ ఇలా పెళ్లి చేసుకుంటే రష్మీ పరిస్థితి ఏంటి భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సుధీర్ పెళ్లి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై సుదీర్ ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం…



























