చెవి నొప్పి చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సంభవిస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ నొప్పి ఒక చెవి లేదా రెండు చెవులలో ఉంటుంది. చాలా సందర్భాలలో ఇది ఒక చెవిలోనే వస్తుంది. చెవి ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల నొప్ప వస్తుంది. నొప్పితో పాటు జ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే మరి చెవి నొప్పి ఉన్నప్పుడు ఇలాంటి చిట్కాలను పాటించాలి? వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం..

చెవి నొప్పిని తగ్గించడానికి జామకాయ, కమల పండు బొప్పాయి పండ్లు తింటే మంచిది. ఇవి చెవి నొప్పిని తగ్గిస్తాయి.అలాగే మూడు వెల్లుల్లి రెమ్మలు తీసుకుని చితకొట్టి అందులో నువ్వుల నూనె వేసి వేడి చేసి ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టి చెవులో నాలుగు నుండి ఐదు చుక్కలు వేసుకుంటే తక్షణ రిలీఫ్ పొందొచ్చు.
రెండు చుక్కల అల్లం రసం చెవిలో వేస్తే వెంటనే రిలీఫ్ ని పొందొచ్చు.ఉల్లి రసంతో కూడా చెవి నొప్పి తగ్గించుకోవచ్చు. దీనితో ఇన్ఫ్లమేషన్, నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి వాటి నుండి బయట పడచ్చు.అదేవిదంగా కొద్దిగా ఆలివ్ ఆయిల్ ని వేడి చేసి చెవిలో వేసుకుంటే కూడా తక్షణ రిలీఫ్ పొందొచ్చు.
రెండు చుక్కల తులసి రసాన్ని కూడా చెవిలో వేస్తే వెంటనే రిలీఫ్ వస్తుంది.ములేతి కూడా చెవి నొప్పి ని పోగొడుతుంది. ములేతిని నేతిలో వేయించి ఆ మిశ్రమాన్ని చెవిలో వేస్తే చక్కగా రిలీఫ్ ని పొందొచ్చు. ఇలా చెవి నొప్పి వచ్చినప్పుడు ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే వెంటనే చెవినొప్పి తగ్గిపోతుంది.



































