Sukrithi Ambati: చాలామంది సెలబ్రిటీలు నటించింది ఒక్క సినిమాలో అయినప్పటికీ అందరికీ ఎంతో బాగా గుర్తుండిపోతారు.కొన్ని కారణాలవల్ల కొంతమంది నటీనటులు కేవలం ఒక్కటి రెండు సినిమాలకు మాత్రమే పరిమితం అవుతూ ఉంటారు. అలా ఒక సినిమాకు మాత్రమే పరిమితమైన వారిలో సుకృతి అంబటి ఒకరు. సుకృతి అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ కేరింత హీరోయిన్ అంటే టక్కున గుర్తుకు వస్తుంది.

2017 వ సంవత్సరంలో వచ్చిన కేరింత సినిమాలో భావన అనే పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సుకృతి ఈ సినిమా అనంతరం ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. ఈమె పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్ళిపోయి ఉన్నత చదువులు చదివారు.
ఇక సోషల్ మీడియాలో అడపాదడప యాక్టివ్ గా ఉండే సుకృతి జూన్ నెలలో తాను నిశ్చితార్థం జరుపుకున్న ఫోటోలను షేర్ చేసి ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చారు. అయితే గత రెండు రోజుల క్రితం ఈమె తన హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇక ప్రస్తుతం పెళ్లి ఫోటోలు కూడా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Sukrithi Ambati: ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిన సుకృతి..
సుకృతి అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వీరి నిశ్చితార్థం తర్వాత తనకు కాబోయే భర్తతో కలిసి ఫోటోషూట్ లో నిర్వహించి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. ఇక సుకృతి విషయానికి వస్తే ఈమె ఢిల్లీలో స్కూలింగ్.. రాజస్థాన్ బనస్థలి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేసింది.ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
































