Sumanth : అక్కినేని వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన సుమంత్ ప్రేమకథ, యువకుడు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కెరీలో సరైన అవకాశాలు వచ్చినపుడు వాటిని వదులుకోకూడదు కానీ సుమంత్ మంచి కథలను చేజార్చుకోవడం వల్ల తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఇక ఎంచుకున్న సినిమాలు సరైన విజయాలు లేకపోతే కెరీర్ అంత బాగా సాగడం లేదు. అయితే కొన్ని సినిమాలు హిట్ అవ్వకపోయినా గుర్తుండిపోయేల ఉంటాయి. అలాంటి సినిమాలను సుమంత్ చేసారు, చేస్తున్నారు కూడా. అందరిలా కమర్షియల్ సినిమాల వైపు చూడకుండా మనసుకు నచ్చిన కథలను చేస్తున్నారు. ఇక సుమంత్ వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలా రుమార్స్ వస్తూనే ఉన్నాయి. కీర్తిరెడ్డి ని పెళ్లిచేసుకుని విడిపోవడం ఆ తరుడొఘావాత సుమంత్ సింగల్ గా ఉండటం వల్ల ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అంటూ పుకార్లు వస్తూనే ఉన్నాయి.

కీర్తీ రెడ్డి గురించి ఆలోచన లేదు…
కీర్తీ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఇద్దరూ విడిపోవడం కూడా చక చకా జరిగాయి. అయితే వీళ్ళు వీడిపోయి చాలా కాలం అయింది కానీ ఇంకా సుమంత్ ఎందుకు ఇంకో పెళ్లి చేసుకోలేదు అంటూ అందరూ డౌట్ పడుతున్నారు. ఇంతకుముందు ఆ అమ్మయితో పెళ్లి ఈ హీరోయిన్ తో పెళ్లి అంటూ పూకార్లు వచ్చినా అవన్నీ పుకార్లుగానే మిగిలాయి. ఇక ఇపుడు మరో రూమర్ బాగా వినిపిస్తోంది. అదే కీర్తి రెడ్డి ని మరచిపోలేక సుమంత్ మరో పెళ్లి చేసుకోలేదు అంటూ అనుకుంటున్నారు. అయితే వీటిపై క్లారిటీ ఇచ్చాడు సుమంత్. ఇంకా నా జీవితం నుండి వెళ్లిపోయిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ కూర్చున్నానని అనుకోవడం అపద్ధం.

నేను చాలా హ్యాపీ గా ఉన్నాను, మళ్ళీ కీర్తీ ని కలవాలి అనే ఆలోచన కూడా లేదు. జీవితంలో సంతోషంగా లేని వాళ్ళే గతం గురించి ఆలోచిస్తారు. పెళ్లి అవసరం కొందరికి కానీ అందరికీ కాదు. నేను నా లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమాలలో సంపాదించాను, వ్యాపారల్లో పెట్టాను బాగా డబ్బు సంపాదించాను. సినిమాల్లోనే డబ్బు సంపాదించాలనే అవసరం నాకు లేదు. ఒక్కోసారి ప్లాప్ అయిన సినిమా కూడా మంచి పాఠం నేర్పిస్తుంది. సినిమాల్లో నా క్యారెక్టర్స్ వేరు నేను వేరు, అయినా పెళ్లయిన వాళ్ళు నా సలహాలు అస్సలు తీసుకోవద్దు అంటూ సలహా ఇచ్చాడు సుమంత్.































