Sunitha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు సింగర్ సునీత. ఇలా ఈమె సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి సునీత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

ఒకానొక సమయంలో ఈమె సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నారు ఎప్పుడైతే ఈమె రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్నారో ఆ క్షణం నుంచి ఈమె తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ అయ్యారు. సునీత పెళ్లి సమయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం ఈమె చాలా సంతోషంగా గడుపుతున్నారు.
ఇక ఇండస్ట్రీలో ఉన్న తర్వాత ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎంతోమంది స్నేహితులకు ఉండడం సర్వసాధారణం అయితే ఇండస్ట్రీలో సునీతకు మాత్రం ఒకే ఒకరు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారట తను ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఈమె తనతో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం సునీత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సునీత బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనే విషయానికి వస్తే…

Sunitha:సుమ సునీత బెస్ట్ ఫ్రెండ్స్…
ఇండస్ట్రీలో సునీత బెస్ట్ ఫ్రెండ్ మరేవరో కాదు యాంకర్ సుమ. వీరిద్దరికి గత కొంతకాలం నుంచి పరిచయం ఉంది ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన ఆ పరిచయం స్నేహంగా మారింది. ఇలా స్నేహితులుగా వీరిద్దరూ వీరికి సంబంధించిన అన్ని విషయాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు.ఇక సునీత రెండవ పెళ్లి సమయంలో కూడా సుమ చేసిన హంగామా గురించి మనకు తెలిసిందే.
































