బిగ్ బాస్ షో రోజురోజుకీ రసవత్తరంగా సాగుతూ, ఎప్పుడు పరిస్థితులు ఏవిధంగా మారుతున్నాయో చెప్పలేని పరిస్థితి. ఇటీవలే కెప్టెన్సీ టాస్క్ లో సన్నీ ఫ్రెండ్షిప్ గురించి కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని మాస్టర్ బాగా ఫీల్ అయ్యింది. అప్పుడు మానస్ వచ్చి సపోర్ట్ చేస్తున్నా కూడా ఏడుస్తూ ఎమోషనల్ అయ్యింది.

ఈ సారి అనీ మాస్టర్ కెప్టెన్సీ టాస్క్ లో సన్నీ కి సపోస్ట్ చేసింది. అప్పుడు ఫ్రెండ్ షిప్ అని ఏదో డైలాగ్ అన్నావ్ కదా ఇది ఫ్రెండ్షిప్ అంటే.. అంటూ బెలూన్ పగలగొట్టే సూది ఇచ్చింది. దీనితో సన్నీ రవి బెలూన్ పగలగొట్టే బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అయ్యాడు. ఇక ఫన్నీ తనకు సపోర్ట్ చేసిన అని మాస్టర్ కి థ్యాంక్స్ చెబుతూ గట్టిగా బుగ్గపై ముద్దు పెట్టాడు.

ఆ తరువాత అనీ మాస్టర్ దగ్గరకు వచ్చి సెన్సార్ ఒప్పుకోదు కానీ అని మాస్టర్ కూ అసలు లిప్ కిస్ ఇచ్చేవాడిని అంటూ సరదాగా జోక్ వేశాడు. ఈ విషయంపై స్పందించిన అనీ మాస్టర్ సిన్సియర్ గా అప్పుడు నీకు పే బ్యాక్ ఇవ్వాలని ఈ విషయం చెప్పాలని అనుకున్నాను అందుకే ఇప్పుడు ఇలా చేశాను అని తెలిపింది.
కెప్టెన్సీ పోటీదారుల కి సపోర్ట్ చేయడం కోసం హౌస్ మెట్ సూదిని పట్టుకుంటే, ఒకవేళ నాకు సూది దొరికితే నీకు ఇచ్చి ఒక డైలాగ్ చెప్తాను అని తెలిపింది. దీంతో సన్నీ మేడమ్ మీరు ఇక్కడ కూర్చుంటే మీకు సూది ఎలా దొరికింది అన్నట్టుగా మాట్లాడాడు. దీనితో అని మాస్టర్ రవి కాకుండా సన్నీకి సపోర్ట్ చేసి సన్నీ నీ కెప్టెన్ చేయడంలో కీలక పాత్ర పోషించింది.































