మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి జీవితంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. మనిషి జీవన విధానం, ఆహారపు అలవాట్లలో పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది పోషకాహారానికి బదులుగా అనారోగ్య సమస్యలను తెచ్చి పెట్టే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లకు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

అదే పూర్వకాలంలో మన పెద్దవారు పొలంలో పండిన చిరుధాన్యాలు రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరికెలు వంటి వాటిని విరివిగా ఉపయోగించేవారు.ఇది ధాన్యాలలో ఎన్నో పోషక విలువలు ఉండటం వల్ల ఇవి కడుపునింపడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందించేది. అందుకే పెద్దవారు ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు .ఈ ధాన్యాలలో ఒకటైనా అరికెలలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
అరికెలలో ఫైబర్ లు, క్యాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ క్రమంలోనే అరికెలను తినడం ద్వారా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, సరైన సమయానికి రుతుక్రమం రాకపోవడం, మధుమేహం, కండరాల నొప్పి,కంటి నరాల బలహీనత వంటి సమస్యలను దూరం చేయడానికి ఈ అరికెలు ఎంతగానో దోహదపడతాయి.
కీళ్ళ వాపు సమస్యతో బాధపడేవారికి ఈ అరికే పిండితో వాపు పై పూతగా రాయడం వల్ల తొందరగా కీళ్ళ వాపు నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా టైఫాయిడ్ డెంగ్యూ వంటి వాటితో బాధపడే వారు కూడా అరికెలు తినడం ద్వారా తొందరగా ఈ విష జ్వరాల నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా అరికెలు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందింప చేయడానికి దోహదపడతాయి.































